అపజయం అంటే తెలియకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 5 సినిమాలుగా నాన్ స్టాప్ గా జోరు మీదున్న టైం లో రెండేళ్ళ టైం లో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కోసం కేటాయించగా మరో ఏడాది పాటు టైం ఈ సినిమాకే సరిపోయేలా ఇప్పుడున్న పరిస్థితులు అడ్డు వస్తున్నాయి. మరో పక్క రామ్ చరణ్ కూడా ఈ సినిమాకే కమిట్ అయ్యి ఉండగా రామ్ చరణ్ తో పోల్చితే ఎన్టీఆర్ పరిస్థితి వేరుగా ఉంది.
ఈ సినిమా కోసం ఇప్పటికే రెండేళ్ళు ఇచ్చేయడంతో ఈ ఇయర్ సమ్మర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మొదలు పెట్టాల్సిన సినిమా ఇప్పుడు ఎప్పుడు మొదలు అవుతుంది అన్నది క్లారిటీ లేకుండా పోయింది, ఈ ఇయర్ ఎండ్ లో ప్రారంభం జరగోచ్చు కానీ…
రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ తర్వాతే మొదలు అయ్యే అవకాశం ఉండగా…ఈ సమ్మర్ లో మొదలు అవుతుంది అనుకుని నిర్మాత ముందే ఎన్టీఆర్ కి భారీ అమౌంట్ ని అడ్వాన్స్ గా ఇచ్చేశారట. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరింత ఆలస్యం అయ్యేలా ఉండటంతో…
నిర్మాతకి ఏం అవసరం ఉంటుందో ఏమో అని, తీసుకున్న అడ్వాన్స్ ని రిటర్న్ చేశారని ఇండస్ట్రీ లో టాక్ ఉంది… మళ్ళీ పరిస్థితులు మాములుగా అయ్యాక అప్పుడు ఇచ్చేయండి అంటూ ఎన్టీఆర్ చెప్పారని వార్తా ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుండగా ఎంతవరకు ఇది నిజం అన్నది తెలియాల్సి ఉంది. వరుస పెట్టి అప్ కమింగ్ మూవీస్ ని ఒప్పుకున్న ఎన్టీఆర్…
ఆర్ ఆర్ ఆర్ వలన లాక్ అయిపోగా ఆ ఎఫెక్ట్ అప్ కమింగ్ కమిట్ మెంట్స్ మీద కూడా పడబోతుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ఈ ఇయర్ ఎండ్ కే తిరిగి మొదలు అయ్యే అవకాశం ఉందని, అది కూడా పరిస్థితి సద్దుకుంటేనే జరుగుతుందని అంటున్నారు. ఇక రామ్ చరణ్ కూడా కొత్త సినిమాను ఈ సినిమా రిలీజ్ తర్వాతే కమిట్ అవ్వాలని చూస్తున్నారు.