కొన్ని సినిమాల కాన్సెప్ట్ లు బాగున్న సరిగ్గా తీయకపోతే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోక బొక్క బోర్లా పడతాయి… అలాంటి కోవలోకే వచ్చే సినిమాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (JR NTR) కెరీర్ లో సింహాద్రి(Simhadri) లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన ఆంధ్రావాలా(Andhrawala) సినిమా ఒకటి…
పూరీజగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద హైప్ మరో లెవల్ కి వెళ్ళగా సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యి డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది. అలాంటి ఈ సినిమాను కన్నడలో స్వర్గీయ నటుడు అయిన పునీత్ రాజ్ కుమార్ తో…
పూరీజగన్నాథ్ వీర కన్నడిగ పేరుతో రీమేక్ చేశారు, మెయిన్ స్టోరీ పాయింట్ అదే అయినా కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో అక్కడ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది…. ఇక్కడ సినిమా మీద మరీ అంచనాలు ఎక్కువ అవ్వడం, సెకెండ్ ఆఫ్ స్టోరీ అంచనాలను అందుకోక పోవడం….
ఆ టైంలో భారీగా ఎదురుదెబ్బ కొట్టాయి, కానీ కన్నడ ఆడియన్స్ కి వీర కన్నడిగ బాగానే నచ్చడంతో అక్కడ భారీ విజయాన్ని ఆ సినిమా సొంతం అయ్యింది… ఒక భాషలో ఫ్లాఫ్ అయిన సినిమా మరో భాషలో హిట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ఆంధ్రావాలా కన్నడ రీమేక్ విషయంలో ఇది జరగడం విశేషం…
Remake director meher ramesh