దర్శకుడిగా ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పేపర్ బాయ్ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పెద్దగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు కానీ యావరేజ్ అనిపించుకుంది ఈ సినిమా.
కానీ పోటీ లో రెండు వారాల నుండి బాక్స్ ఆఫీస్ ను ఊపేస్తున్న గీత గోవిందం సినిమా మూడో వీకెండ్ లో కూడా జోరు చూపడంతో ఈ సినిమాకి ఎదురుదెబ్బ తగిలింది. సినిమాను మొత్తం మీద 2 కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మినిమమ్ 2.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా వీకెండ్ మొత్తం మీద కలిపి టోటల్ గా 75 లక్షల షేర్ ని మాత్రమే సాధించగలిగింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సేఫ్ అవ్వడానికి మరో 1.75 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది…అది అసాధ్యమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.