కే రాఘవేంద్రరావు గారి సమర్పణలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పెళ్లి సందD దసరా సీజన్ బాక్స్ ఆఫీస్ బరిలో నిలవగా పోటి లో ఉన్న మిగిలిన సినిమాల కన్నా చిన్న సినిమా అవ్వడంతో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అనుకుంటే ఏకంగా ఈ సినిమా కన్నా డబుల్ కన్నా ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన మహా సముద్రం ని కూడా దాటే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతుంది.
కానీ ఈ సినిమా చిన్న బడ్జెట్ తో తీసిన సినిమా అని అందరూ అనుకున్నారు కానీ చిన్న సినిమాలు అంటే 2-4 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తీసిన సినిమాలను అంటారు కానీ ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 8.5 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. భారీ స్టార్ కాస్ట్ తో…
గ్రేట్ విజువల్స్ అండ్ టేకింగ్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఏ ధైర్యంతో అంత బడ్జెట్ పెట్టారో తెలియదు కానీ సినిమా ఓవరాల్ గా సాధించిన థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ను గమనిస్తే… థియేట్రికల్ రైట్స్ 5.5 కోట్ల రేంజ్ లో సొంతం అయ్యి మేజర్ బిజినెస్ రికవరీ అవ్వగా…
కే రాఘవేంద్రరావు బ్రాండ్ వలన శాటిలైట్ రైట్స్ 2.5 కోట్లు డిజిటల్ రైట్స్ 1.2 కోట్లు అలాగే మ్యూజిక్ రైట్స్ 35 లక్షలు సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కింద 1.6 కోట్ల రేటు ని సొంతం చేసుకుందట. దాంతో టోటల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ 5.65 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుందని ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది, అంటే సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రెండూ కలిపి…
ఇప్పుడు 11.15 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా బడ్జెట్ మీద 2.65 కోట్ల ప్రాఫిట్ కూడా నిర్మాతలకు దక్కిందని చెప్పొచ్చు. ఇది నిజంగానే అద్బుతం అని చెప్పాలి. చిన్న సినిమా అనుకున్నారు కానీ ఓవరాల్ గా నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టిన ఈ సినిమా ఇక కొన్న బయ్యర్స్ కి ఇంకా లాభాలు తేవాల్సి ఉంది…