కే రాఘవేంద్రరావు గారి సమర్పణలో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా పెళ్లి సందD… దసరా బరిలో మిగిలిన సినిమాలతో పోల్చితే వీక్ మూవీ గా రిలీజ్ అయిన ఈ సినిమాకి రివ్యూలు కూడా మిక్సుడ్ గా వచ్చాయి. చాలా రొటీన్ మూవీ అని, ఎలాంటి కొత్తదనం లేదని విమర్శలు కూడా వచ్చాయి. కానీ అవేవి కూడా సినిమా బాక్స్ ఆఫీస్ విజయాన్ని అడ్డుకోలేక పోయాయి. పండగ సెలవుల్లోనే ఈ సినిమా కన్నా ఎన్నో రెట్లు…
పెద్దది అయిన మహా సముద్రం లాంటి సినిమానే డామినేట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సూపర్ స్ట్రాంగ్ గా రన్ ని కొనసాగించి జోరును అలానే కొనసాగించింది, దాంతో సినిమా కలెక్షన్స్ జోరు మూడు వారాల పాటు…
నిర్విరామంగా కొనసాగగా కొత్త సినిమాల కోసం థియేటర్స్ ని చాలా వరకు కోల్పోయిన ఈ సినిమా కి ఇక నెట్ ఫ్రీగా రన్ ని కొన్ని సెంటర్స్ లో కొనసాగిస్తుంది. నెట్ ఫ్రీ అంటే ఇక రన్ అయిపొయింది కాబట్టి ఇక మీదట వచ్చే షేర్స్ అన్నీ థియేటర్స్ వాళ్ళకి సొంతం అని…
రీసెంట్ గా కొత్త సినిమాలు వచ్చినా కానీ వీకెండ్ లో ఉన్న థియేటర్స్ లోనే సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని అందుకోగా గాజువాక ఏరియాలో మినీ మోహిని థియేటర్ లో వీకెండ్ లో హౌస్ ఫుల్ గా నడిచిన సినిమా నిన్న సోమవారం వర్కింగ్ డే అయినా కానీ ఈవినింగ్ షోకి హౌస్ ఫుల్ బోర్డుతో దుమ్ము లేపడం విశేషం అనే చెప్పాలి.
ఫస్ట్ షో తర్వాత సెకెండ్ షో కి కూడా ఆల్ మోస్ట్ 80% ఆక్యుపెన్సీతో రన్ అయ్యిందట ఈ సినిమా. ఇలా బాక్స్ ఆఫీస్ రన్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయినా కానీ హౌస్ ఫుల్ బోర్డులు పడటం అంటే మామూలు విషయం కాదు, చిన్న సినిమానే అయినా కొన్ని పెద్ద సినిమాల వలన కానిది ఈ సినిమా వలన అయింది అని చెప్పాలి.