Home న్యూస్ పక్కా కమర్షియల్ టీసర్ రివ్యూ…ఈ సారి బ్లాక్ బస్టర్ పక్కా!

పక్కా కమర్షియల్ టీసర్ రివ్యూ…ఈ సారి బ్లాక్ బస్టర్ పక్కా!

622
0

గోపీచంద్ రాశిఖన్నా ల కాంబినేషన్ లో మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్… చాలా కాలంగా హిట్స్ కి దూరం అయిన గోపీచంద్ రీసెంట్ గా సీటిమార్ తో కంబ్యాక్ కొట్టినా క్లీన్ హిట్ ని జస్ట్ లో మిస్ చేసుకున్నాడు, అయినా ఆడియన్స్ మనసు గెలుచుకున్న గోపీచంద్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుండగా సినిమా టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం… మీరు ఇప్పుడు చేస్తున్నారు… నేను ఎప్పుడో చూసి వచ్చేసా అంటూ గోపీచంద్ డైలాగ్ ఆకట్టుకోగా విజువల్స్ అండ్ గ్రాండియర్ చాలా రిచ్ గా మెప్పించాయి అని చెప్పాలి, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా మెప్పించగా ఓవరాల్ గా టీసర్ చూస్తుంటే…

ఈ సారి మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ను కూడా మెప్పించి బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నారని చెప్పాలి. లుక్స్ కూడా స్టైలిష్ గా ఉండగా రాశిఖన్నా టీసర్ ఎండ్ లో ఆకట్టుకుంది. పక్కా కమర్షియల్ లాయర్ గా నటిస్తున్న గోపీచంద్ ఈ సారి బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here