సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పేట బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ కానుండగా ఓవరాల్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 124.5 కోట్ల రేంజ్ లో ఉండటం తో ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 126 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం నెలకొంది అని చెప్పాలి. కాగా సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అన్నది కూడా ఆసక్తిగా మారింది.
తమిళనాడు లో అజిత్ కుమార్ విశ్వాసం నుండి గట్టి పోటి ఉండగా ఈ సినిమా కి సుమారు గా 550 నుండి 800 వరకు థియేటర్స్ అక్కడ దొరకనున్నాయి. ఇక రెండు రాష్ట్రాలలో 250 నుండి 300 వరకు థియేటర్స్ ఈ సినిమాకి దొరకనున్నాయి.
ఇక కర్ణాటక లో 150 వరకు థియేటర్స్ హిందీ వర్షన్ 600 వరకు థియేటర్స్ ఈ సినిమా కి దక్కనుండగా ఓవర్సీస్ లో 400 నుండి 500 వరకు థియేటర్స్ సొంతం కానుంది, దాంతో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 2400 రేంజ్ థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకోనుంది, రిలీజ్ సమయానికి ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పొచ్చు.