Home TRP రేటింగ్ దర్బార్ షాకింగ్ TRP…ఏంటి సామి ఇది!

దర్బార్ షాకింగ్ TRP…ఏంటి సామి ఇది!

0

     కోలివుడ్ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఈ మధ్య టాలీవుడ్ లో ఎందుకనో పెద్దగా కలిసి రావడం లేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా లు నిరాశ పరిచే రిజల్ట్ ని సొంతం చేసుకుంటూ ఉండగా బుల్లి తెరపై కూడా అనుకున్న రేంజ్ TRP రేటింగ్స్ కూడా రావడం లేదు… సంక్రాంతి రేసులో రెండు సార్లు నిలిచిన రజినీ 2 సార్లు పర్వాలేదు అనిపించే సినిమాలతోనే వచ్చినా కానీ.. సక్సెస్ ను అందుకోలేదు.

పేట, దర్బార్ సినిమాలు తెలుగు లో నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకున్నాయి. ఇక అంతకుముందు వచ్చిన రోబో 2.0 సినిమా కూడా భారీ టార్గెట్ ని అందుకోవడం లో విఫలం అయిన విషయం తెలిసిందే. ఇక బుల్లి తెరపై రోబో 2.0 సినిమా టెలికాస్ట్ అయిన మొదటి సారి…

9.8 TRP రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకుని సినిమా హైప్ ని అందుకోలేక పోయింది. ఇక పేట సినిమా అయితే కేవలం 3.94 TRP రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకోగా ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యం లో చిన్న పెద్ద సినిమాలకు సాలిడ్ TRP రేటింగ్ లు దక్కుతున్న సమయం లో కూడా…

సూపర్ స్టార్ సంక్రాంతి మూవీ దర్బార్ టెలికాస్ట్ అవ్వగా కేవలం 6.89 TRP రేటింగ్ ని మాత్రమే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే ఇక్కడ షాకింగ్ లో TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీ లో మాత్రం గత వారం టాప్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుందని….

చెబుతున్నారు, కానీ తెలుగు లో మాత్రం పాత సినిమాలు అయిన సరైనోడు లాంటి సినిమాలు ఏకంగా 7.94 TRP రేటింగ్ ని అందుకోగా పాత సినిమా సంక్రాంతి కి కూడా 6.04 TRP రేటింగ్ దక్కింది. వాటితో పోల్చుకుంటే కొత్త సినిమా అయిన దర్బార్ కి మాత్రం ఇంత షాకింగ్ TRP రేటింగ్ దక్కడం ఒకింత షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here