Home న్యూస్ పొగరు రివ్యూ రేటింగ్….ఏంటి సామి ఇది!!

పొగరు రివ్యూ రేటింగ్….ఏంటి సామి ఇది!!

0

ఒక్క పాటతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న డబ్బింగ్ మూవీ పొగరు, యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ సార్జా హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కోసం హీరో 3 ఏళ్ళు కష్టపడ్డాడు. సినిమా కన్నడలో వన్ ఆఫ్ మోస్ట్ అవైటెడ్ మూవీ గా నిలిచింది, తెలుగు లో పాట పాపులర్ అవ్వడంతో మంచి క్రేజ్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, మరి సినిమా ఎలా ఉందొ ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే… చిన్న ఏజ్ లోనే తండ్రిని కోల్పోయిన హీరో తల్లి ఉన్న అనాధ ఆశ్రమంలో పెరుగుతాడు, తనని తన కాలనీ వాళ్ళు ఆదరిస్తారు. దాంతో వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి తెగించే హీరో పెద్దయ్యాక టీచర్ రష్మిక ని చూసి లవ్ చేయడం, తన లవ్ కోసం తను మారాడా లేదా తన ఫ్యామిలీ తో తిరిగి కలిసాడా లేదా అన్నది సినిమా కథ పాయింట్….

పెర్ఫార్మెన్స్ పరంగా హీరో మనకు కొత్తవాడు కాబట్టి అలవాటు పడటానికి కొంత టైం పడుతుంది, అలవాటు పడ్డాక ఇంటర్వెల్ తర్వాత హీరో క్యారెక్టర్ మారిపోతుంది… దానికి టైం పడుతుంది ఈ లోపు సినిమా అయిపోతుంది. హీరో డైలాగ్స్ యాక్షన్ సీన్స్ అదిరిపోయింది.

ఎలివేషన్ సీన్స్ కూడా కుమ్మేశాయి… ఇక రష్మిక సాంగ్స్ లో ఎక్కువగా సీన్స్ లో తక్కువగా కనిపించింది… మిగిలిన రోల్స్ కూడా ఓకే అనిపించే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి మెయిన్ హైలెట్స్… సాంగ్స్ ఆల్ రెడీ క్రేజ్ ని సొంతం చేసుకోగా తెరపై అవి ఇంకా బాగున్నాయి… డాన్సులు కూడా హీరో కుమ్మేశాడు. ఇక ఎలివేషన్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా మెప్పిస్తుంది.

ఎడిటింగ్ స్క్రీన్ ప్లే పరమ రొటీన్, మనం ఇలాంటి కథలు ఎన్నో ఎన్నెన్నో చూసి చూసి ఉన్నాం. ఈ సినిమా మళ్ళీ అదే కథతో వచ్చింది. సినిమాటోగ్రఫీ బాగుండగా తెలుగు డైలాగ్స్ చాలా లౌడ్ గా అనిపించాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…

డైరెక్టర్ అతి సాధారణ మైన కథని కంప్లీట్ మాస్ అంశాలతో ఫక్తు కమర్షియల్ మూవీ ఎలా తీయాలో అలానే తీశారు, ఇలాంటి కథలు తెలుగులో ముందే చెప్పినట్లు ఎన్నో చూసి చూసి విసుగు చెంది ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఇదే తరహా కథని మంచి మాస్ రీచ్ ఉన్న సాంగ్స్ తో వచ్చిన పొగరు సినిమా కేవలం అలాంటి మాస్ రొటీన్ మూవీస్ ఇష్టపడే వారికోసమే…

ఓవరాల్ గా సినిమా కంప్లీట్ మాస్ మూవీస్ ఇష్టపడే వారు కూడా ఈ కథ మేం ఆల్ రెడీ ఎన్నో సార్లు చూశాం రా బాబు అని అనుకోవడం ఖాయం. అయినా కానీ ఒకటి రెండు సాంగ్స్ కోసం హీరోయిజం ఎలివేట్ సీన్స్ కోసం రొటీన్ అయినా ఒకసారి ట్రై చేయోచ్చు. సినిమా కి ఫైనల్ గా మా రేటింగ్ 2.25 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here