Home TRP రేటింగ్ 21 కోట్ల బ్లాక్ బస్టర్ పొలిమేర2….TRP రేటింగ్…ఇక్కడ కూడా కుమ్మిందిగా!

21 కోట్ల బ్లాక్ బస్టర్ పొలిమేర2….TRP రేటింగ్…ఇక్కడ కూడా కుమ్మిందిగా!

0
Polimera2 Movie TRP Rating
Polimera2 Movie TRP Rating

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మూవీస్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఊహకందని విజయాన్ని అందుకున్న సినిమాగా పొలిమేర2(Polimera2 Movie) సంచలన కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా నవంబర్ లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయ్యి కూడా సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…

4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో ఏకంగా 10.80 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని 21.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 6.8 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అన్ సీజన్ లో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత డిజిటల్ లో కూడా సాలిడ్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపింది. టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వడానికి మాత్రం కొంత టైం తీసుకున్న సినిమా ఆల్ మోస్ట్ 6 నెలల తర్వాత పొలిమేర2 మూవీ…

స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయింది. ఛానెల్ వాళ్ళు మంచి ప్రమోషన్స్ ని చేసి టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా మొదటి సారి టెలికాస్ట్ అయిన తర్వాత సినిమా కి 6.21 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని బాగానే కుమ్మేసింది సినిమా….

ఈ సినిమా జానర్ దృశ్యా చూసుకుంటే టెలివిజన్ లో కూడా సాలిడ్ గానే జోరుని చూపించింది సినిమా. చిన్న సినిమానే అయినా కూడా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర తర్వాత డిజిటల్ లో ఇప్పుడు టెలివిజన్ లో కూడా సాలిడ్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఓవరాల్ గా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here