బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ సీజన్ చాలా చప్పగా సాగుతూ ఉండగా ఏ సినిమా కూడా పెద్దగా ఆడియన్స్ ను అలరించలేకపోతున్నాయి. రీసెంట్ గా మే మొదటి వారంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచాయి. ఇక ఇప్పుడు మే రెండో వారంలో ఎలక్షన్స్ కి మరింత చేరువ అయిన టైంలో..
ఆడియన్స్ ముందుకు 2 సినిమాలు పోటి పడబోతున్నాయి…నారా రోహిత్(Nara Rohit) నటించిన ప్రతినిధి2(Prathinidhi 2 Movie) సినిమా ఒకటి కాగా మరోటి సత్యదేవ్(Satyadev) నటించిన కృష్ణమ్మ(Krishnamma Movie) సినిమాలు శుక్రవారం రిలీజ్ కానుండగా మేకర్స్ సినిమాలను బాగానే ప్రమోట్ చేయడానికి ట్రై చేసినా కూడా…
పొలిటికల్ హీట్ మరింత పెరిగిన ఈ టైంలో జనాలు మరీ అనుకున్న రేంజ్ లో సినిమాలకు ప్రాదాన్యత ఏమి ఇవ్వడం లేదు, దాంతో ఏ సినిమాకి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఏమాత్రం జోరు కనిపించడం లేదు, రెండు సినిమాలు కలిపి పట్టుమని 50 లక్షల గ్రాస్ బుకింగ్స్ ను కూడా సొంతం చేసుకోలేక పోయాయి ఇప్పుడు…
రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత సేఫ్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 3.5 కోట్ల చొప్పున షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బుకింగ్స్ మాత్రం అంతంతమాత్రమే ఉండటంతో రెండు సినిమాలకు కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ చాలా అవసరం అనే చెప్పాలి.
ప్రతినిధి2 సినిమా కన్నా కొంచం మాస్ లో కృష్ణమ్మ మూవీకి ఎక్కువ ఓపెనింగ్స్ సొంతం అయ్యే అవకాశం ఉంది, కానీ ఓవరాల్ గా రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటేనే ఎంతో కొంత కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి సినిమాలు ఆడియన్స్ ను ఎంతవరకు అలరించగలుగుతాయో చూడాలి ఇప్పుడు….