Home న్యూస్ ప్రేమలు-మంజుమ్మేల్ బాయ్స్…బడ్జెట్ మీద ఎన్ని రెట్లు వసూల్ చేశాయో తెలిస్తే షాకవ్వాల్సిందే!!

ప్రేమలు-మంజుమ్మేల్ బాయ్స్…బడ్జెట్ మీద ఎన్ని రెట్లు వసూల్ చేశాయో తెలిస్తే షాకవ్వాల్సిందే!!

0

అప్పుడప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఊహకందని కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి…ఈ ఇయర్ వచ్చిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan Movie) బడ్జెట్ తక్కువే అయినా కూడా కలెక్షన్స్ పరంగా ఊచకోత కోసింది. ఇక ఆడియన్స్ ముందుకు మలయాళంలో రీసెంట్ గా…

రిలీజ్ అయిన 2 సినిమాల బడ్జెట్ లు చాలా తక్కువే అయినా కూడా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రికార్డుల దుమ్ము దుమారం లేపాయి. అన్ సీజన్ లో ఇండస్ట్రీ రికార్డుల దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి. ప్రేమలు(Premalu Movie) అలాగే మంజుమ్మేల్ బాయ్స్(ManjuMmel Boys Movie) లు రెండూ కూడా బడ్జెట్ మీద…

ఏకంగా 10 రెట్లకు పైగా కలెక్షన్స్ ని గ్రాస్ రూపంలో సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి…. ప్రేమలు మూవీ బడ్జెట్ 8.5 కోట్ల రేంజ్ లో రూపొందగా ప్రమోషన్స్ ఖర్చులు ఇతర ఖర్చులతో కలిపి 10 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు 125 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకుంది…

ఇక మంజుమ్మేల్ బాయ్స్ మూవీ కొంచం ఎక్కువ బడ్జెట్ తో రూపొందినా కూడా ఊచకోత కోసింది. అన్ని ఖర్చులు అండ్ ప్రమోషన్స్ తో కలిపి 20 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో ఈ సినిమా రూపొందగా టోటల్ గా ఇప్పటి వరకు సినిమా 215 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళతో ఊచకోత కోసింది…

అంటే రెండు సినిమాలు కూడా పెట్టిన డబ్బు మీద 10 రెట్లకి పైగా కలెక్షన్స్ ని అన్ సీజన్ లో సొంతం చేసుకుని బిగ్గెస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది… మన దగ్గర హనుమాన్ మూవీ 50 కోట్ల రేంజ్ బడ్జెట్ మీద ఆల్ మోస్ట్ 300 కోట్ల లోపు గ్రాస్ తో దుమ్ము లేపగా మలయాళం మూవీస్ 10 రెట్ల కలెక్షన్స్ తో మెంటల్ మాస్ జాతర సృష్టించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here