Home టోటల్ కలెక్షన్స్ ప్రేమలు(తెలుగు): 3 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది….లాభాలు ఎన్ని వచ్చాయో తెలుసా!

ప్రేమలు(తెలుగు): 3 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది….లాభాలు ఎన్ని వచ్చాయో తెలుసా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ ఇండస్ట్రీ తరుపున ఈ ఇయర్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ పడగా ప్రేమలు(Premalu Movie) తెలుగులో కూడా డబ్ అయ్యి కొంచం స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా స్టడీగా లాంగ్ రన్ ను సొంతం చేసుకుని సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ తెలుగు రాష్ట్రాలలోనే కాదు…

ఓవర్సీస్ లో సైతం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం. సినిమా తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గా వాల్యూ టార్గెట్ 3 కోట్ల రేంజ్ లో ఉండగా ప్రేమలు మూవీ తెలుగులో మొత్తం మీద పరుగు పూర్తి అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Premalu Telugu Total WW Box Office Collections Report
👉Nizam: 3.90CR~
👉Total AP: 3.30CR~
Total AP-TG Collections:- 7.20CR~(13.55CR~ Gross)
👉KA+ROI+OS -1.65CR
Total WW Collections – 8.85CR (17.00CR~ Gross)

మొత్తం మీద సినిమా 3 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ మీద టోటల్ రన్ లో 8.85 కోట్ల షేర్ ని 5.85 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేప బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సినిమా..మలయాళ సినిమాల పరంగా తెలుగు లో…

17 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని తెలుగు డబ్ లో హైయెస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని అందుకున్న మలయాళ మూవీగా సంచలనం సృష్టించింది ప్రేమలు మూవీ…. ఇక పార్ట్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా ఆ సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు మరింత సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here