Home న్యూస్ విజిల్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫ్లాఫా!!

విజిల్ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫ్లాఫా!!

0

      టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని రీసెంట్ టైం లో చాలా త్వరగా సొంతం చేసుకున్న కోలివుడ్ హీరోలలో ఇలయ దళపతి విజయ్ కూడా ఒకరు. గత కొన్ని ఏళ్లలో తన మార్కెట్ ఇక్కడ అమాంతం పెరిగి పోతూ వస్తుండగా విజయ్ అట్లీ ల కాంబినేషన్ లో తెరి మరియు మెర్సల్ ల తర్వాత తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బిగిల్ తెలుగు లో విజిల్ పేరు తో రిలీజ్ కాగా సినిమా ప్రీమియర్ షోలు పూర్తీ అయ్యాయి.

ముంబై లో నిన్నే షోలు కంప్లీట్ కాగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల తర్వాత సినిమా టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ.. కథ పాయింట్ పూర్తిగా రివీల్ చేయకున్నా ఓవరాల్ గా ఒక తండ్రి కొడుకుల వివిధ నేపధ్యాల సమూహమె బిగిల్ కథ.

అందులో ఇతర ఉప కథలు కూడా ఉండగా అవన్నీ థియేటర్స్ లో చూడాల్సిందే అంటున్నారు సినిమా చూసినవాళ్ళు. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మూడు డిఫెరెంట్ రోల్స్ లో విజయ్ నటన ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఫుట్ బాల్ ప్లేయర్ గా…

కోచ్ గా…. రౌడీ తండ్రి గా మూడు డిఫెరెంట్ పాత్రలు ఆడియన్స్ కి అద్బుతంగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇక తన డైలాగ్స్ హీరోయిజం ఎలివేట్ సీన్స్, ఫైట్ సీన్స్ లో విజయ్ మ్యానరిజమ్స్ కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవ్వడం ఖాయమని అంటున్నారు.

హీరోయిన్ నయనతార కి మరీ అంత ముఖ్య పాత్ర లేకపోయినా ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తుందని, కానీ ప్లేయర్స్ గా నటించిన అమ్మాయిలు అందరు దుమ్ము లేపారని అంటున్నారు. ఇక మిగిలిన నటీనటులు తెలుగు ఆడియన్స్ కి పెద్దగా టచ్ లేని వాళ్ళు కాబట్టి ఉన్నంతలో ఆకట్టుకున్నారని అంటున్నారు.

ఇక మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్స్ పరంగా రెహమాన్ పూర్తీ మ్యాజిక్ కనిపించలేదని, పాటలు యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుందని ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుందని అంటున్నారు. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వరకు

స్లో నరేషన్ తో కూడుకుని ఉంటుందని, ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ చాలా పెద్దది అవ్వడం అందులో ఎమోషనల్ సీన్స్ మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగిందని, సినిమా ని చాలా ఎడిట్ చేసే అవకాశం ఉన్నా అలా చేయలేదని అంటున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అడిరిపోగా…

డైరెక్షన్ పరంగా అట్లీ మంచి కథని ఎంచుకుని అందులో సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా బాగా సెట్ చేశాడని, ఫ్యాన్స్ కోరుకునే అంశాలను కూడా జోడించిన అట్లీ లెంత్ అండ్ సెకెండ్ ఆఫ్ హెవీ సెంట్ మెంట్ విషయం లో మాత్రం ఆశించిన మేర సక్సెస్ కాలేదని అంటున్నారు.

హైలెట్స్ విషయానికి వస్తే మూడు పాత్రల్లో విజయ్ పెర్ఫార్మెన్స్, ఫైట్స్, ఫుట్ బాల్ మ్యాచ్, సెకెండ్ ఆఫ్ కొన్ని సన్నివేశాలు, అమ్మాయిల ట్రైనింగ్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్ బాగుండగా… స్లో నరేషన్, లెంత్ మరియు హెవీ తమిళ్ ఫ్లేవర్ ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ అని అంటున్నారు.

మొత్తం మీద ఓవర్సీస్ ఆడియన్స్ నుండి సినిమాకి ఎబో యావరేజ్ రేంజ్ టాక్ వినిపిస్తుందని చెప్పొచ్చు. సినిమా మరీ విజయ్ అట్లీ ల కాంబో లో వచ్చిన తెరీ మెర్సల్ అంత లేకున్నా సర్కార్ మాదిరిగా పర్వాలేదు అనిపించే విధంగా ఉంది అనేది ఫైనల్ టాక్. ఇక రెగ్యులర్ షోలకు సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here