Home న్యూస్ ప్రిన్స్ మూవీ రివ్యూ….సినిమా హిట్టా-ఫట్టా!!

ప్రిన్స్ మూవీ రివ్యూ….సినిమా హిట్టా-ఫట్టా!!

0

వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ సినిమాలతో తెలుగులో మంచి హిట్స్ ని అందుకున్న శివకార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ప్రిన్స్ ఆడియన్స్ ముందుకు తమిళ్ తో పాటు తెలుగులో ఒకే సారి రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుని అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే విలేజ్ లో టీచర్ గా పని చేస్తున్న హీరో బ్రిటిష్ అమ్మాయిని ఇష్టపడతాడు…

తన ప్రేమని తన నాన్న అయిన సత్యరాజ్ అడ్డు పడతాడు, అలాగే ఊర్లో వాళ్ళు కూడా వ్యతిరేకించగా హీరో ఎలా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేశాడు అన్నది సినిమా కథ. కథ పరంగా జాతిరత్నాలు మాదిరిగానే ఇందులో కూడా పెద్దగా కథ లేకుండానే డైరెక్ట్ చేసిన అనుదీప్ జాతిరత్నాలు మ్యాజిక్ ని మాత్రం రీ క్రియేట్ చేయలేక పోయాడు….

పెర్ఫార్మెన్స్ పరంగా శివకార్తికేయన్ తన రోల్ వరకు బాగా నటించి నవ్వించే ప్రయత్నం చేయగా హీరోయిన్ కూడా ఆకట్టుకోగా సత్యరాజ్ రోల్ కూడా మెప్పిస్తుంది, ఫస్టాఫ్ వరకు ఎలాగోలా కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వడం, సాంగ్స్ కూడా మెప్పించడంతో పర్వాలేదు అనిపించగా సెకెండ్ ఆఫ్ మాత్రం చెప్పడానికి కథ లేక పోవడంతో సీన్ బై సీన్ స్లాప్ స్టిక్ కామెడీ ట్రై చేసినా కానీ…

అది జాతిరత్నాలు మాదిరిగా వర్కౌట్ అయితే కాలేదు, సినిమాలో కొంత పార్ట్ జబర్దస్త్ ని గుర్తు చేస్తుంది, మొత్తం మీద సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి కొద్ది వరకు కామెడీ పరంగా పర్వాలేదు అనిపించవచ్చు, జాతిరత్నాలు రేంజ్ లో ఊహించుకుని వెళితే సినిమా సగమే ఇంప్రెస్ చేస్తుంది. డైరెక్షన్ పరంగా అనుదీప్ ఇంకా జాతిరత్నాలు హ్యాంగోవర్ లోనే ఉండగా…

అలాంటి మ్యాజిక్ ఒకసారి వర్కౌట్ అవ్వొచ్చు కానీ మళ్ళీ మళ్ళీ వర్కౌట్ అవ్వడం కష్టమే అని చెప్పాలి. మొత్తం మీద సినిమాలో కొన్ని కామెడీ సీన్స్, డీసెంట్ ఫస్టాఫ్, గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సాంగ్స్ ప్లస్ పాయింట్స్ కాగా కథే లేక పోవడం, ఫోర్స్ కామెడీ, వీక్ డైరెక్షన్ లాంటివి మేజర్ మైనస్ పాయింట్స్… అయినా కానీ జస్ట్ కామెడీ కోసం ఒకసారి సినిమాను చూడొచ్చు… సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here