Home న్యూస్ ఇదేం విచిత్రం….సొంత గడ్డ మీద ఎదురుదెబ్బ…ఇది ఎవ్వరూ ఊహించలేదు!

ఇదేం విచిత్రం….సొంత గడ్డ మీద ఎదురుదెబ్బ…ఇది ఎవ్వరూ ఊహించలేదు!

0

బాక్స్ అఫీస్ దగ్గర తమిళ్ ప్రైడ్ గా చెప్పుకున్న పొన్నియన్ సెల్వన్ సినిమా పార్ట్ 1 పరంగా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డులను అన్నీ కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. కానీ పార్ట్ 1 కన్నా కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న పార్ట్ 2 మాత్రం కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ రాగా…

మిగిలిన చోట్ల అంటే ఏమో అనుకోవచ్చు కానీ సినిమా సొంత గడ్డ అయిన తమిళనాడులో కూడా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంది ఇప్పుడు.. పార్ట్ 1 సినిమా మొదటి 6 రోజుల్లో తమిళనాడు లో మొత్తం మీద…

Ponniyin Selvan2 5 Days Total Collections!!

116.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా 6 రోజులు పూర్తీ అయ్యే టైం కి 79.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకుంది. దాంతో రెండు పార్టుల మధ్య గ్యాప్ ఆల్ మోస్ట్…

36.75 కోట్ల రేంజ్ లో ఉండటంతో రెండో పార్ట్ ఏ రేంజ్ లో అండర్ పెర్ఫార్మ్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఎవ్వరికీ అంతుపట్టని విషయం అంటే తమిళ్ ప్రైడ్ అంటూ ఇంతలా ఊదరగొట్టి మంచి టాక్ ని తెచ్చుకున్నా ఇలా అండర్ పెర్ఫార్మ్ చేయడం ఏంటి అంటూ అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు.. ఇక లాంగ్ రన్ లో అయినా సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

Ponniyin Selvan2 4 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here