బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ మాస్ రచ్చ చేస్తుంది. సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ రికార్డుల బెండు తీయగా అన్ని ఏరియాల్లో కూడా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది…
టాలీవుడ్ లో మెయిన్ ఏరియాల్లో ఒకటైన RTC X రోడ్స్ లో సినిమాల క్రేజ్ మరో రేంజ్ లో ఉంటుంది. మొదటి రోజు ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు….కాగా రీసెంట్ టైంలో ఇక్కడ మొదటి రోజే ఏకంగా 1 కోటికి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…
టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దేవర(Devara Part 1) రికార్డ్ కొట్టింది. ఏకంగా 1.17 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది….కానీ ఇప్పుడు ఆ రికార్డ్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన పుష్ప2 మూవీ బ్రేక్ చేసి కొత్త రికార్డ్ కొట్టింది..
రిలీజ్ కి ముందు రోజే స్పెషల్ ప్రీమియర్స్ పడగా ఆ కలెక్షన్స్ అలాగే మొదటి రోజు కలెక్షన్స్ తో పుష్ప2 మూవీ ఏకంగా 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఇక్కడ అందుకుని టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసి దేవర పేరిట ఉన్న రికార్డ్ ను సొంతం చేసుకుంది…
కానీ అదే టైంలో రిలీజ్ రోజు కలెక్షన్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే దేవరకి మొదటి రోజే 1.17 కోట్ల గ్రాస్ రాగా పుష్ప2 కి 1.05 కోట్ల గ్రాస్ వచ్చింది…60 లక్షల రేంజ్ లో గ్రాస్ ముందు రోజు ప్రీమియర్స్ కి వచ్చాయి…దాంతో ఓవరాల్ గా ప్రీమియర్స్ డే 1 కలెక్షన్స్ పరంగా పుష్ప2 రికార్డ్ హోల్డర్ అయితే ఓన్లీ డే 1 రికార్డ్ హోల్డర్ దేవర అని చెప్పొచ్చు….