బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ దిశా పటానీ ల కాంబినేషన్ లో ప్రభుదేవా డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ రాధే. లాస్ట్ ఇయరే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా ఫస్ట్ వేవ్ వలన పోస్ట్ పోన్ అయి ఈ రంజాన్ కి రావాల్సింది కానీ మళ్ళీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఇక డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా డిజిటల్ లో రిలీజ్ అయినా కానీ..
పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ ను సొంతం చేసుకోవడం తో ఎంతవరకు ఆడియన్స్ చూస్తారు అన్నది ఆసక్తిగా మారగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళు ఇదేమి సినిమా రా బాబు అంటూ తలలు పెట్టుకు కూర్చున్నారు. కానీ ఇదే సినిమా తో….
పే పెర్ వ్యూ అనే కొత్త పద్దతి లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. సినిమా మొదటి రోజు ఇండియా లో విరగబడి చూశారని తెలిసింది. ఓవరాల్ గా మొదటి రోజు సినిమా కి ఏకంగా 4.2 మిలియన్ వరకు యూనిక్ వ్యూస్ దక్కినట్లు తెలుస్తుంది.
అంటే ఆల్ మోస్ట్ 42 లక్షల మంది జనాలు జీ ప్లెక్స్ లో ఒక్కో టికెట్ 249 రేటు తో అలాగే కొందరు 499 రేటు తో 1 ఇయర్ సబ్ స్క్రిప్షన్ తీసుకుని సినిమాను చూశారు, వారి లెక్క ఎంత అనేది క్లియర్ గా చెప్పలేదు కానీ మొత్తం మీద 4.2 మిలియన్ వ్యూస్ అంటే…. 104.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా మొదటి రోజు సొంతం చేసుకుందట.
నిర్మాతలు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ లో వ్యూస్ ని కన్ఫాం చేశారు. వ్యూస్ కొంచం పబ్లిసిటీ కోసం ఎక్కువ వేసుకున్నారేమో అనుకున్నా కానీ ఈజీగా 4 మిలియన్ వ్యూస్ అయితే ఉండటం ఖాయం, ఆ లెక్కన చూసుకున్నా 99.6 కోట్ల దాకా కలెక్షన్స్ వచ్చాయని చెప్పొచ్చు. డిసాస్టర్ టాక్ తో కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను ఫస్ట్ డే సొంతం చేసుకోవడం అంటే మామూలు మాస్ కాదనే చెప్పాలి.