Home న్యూస్ రజినీకాంత్ “దర్బార్” ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

రజినీకాంత్ “దర్బార్” ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

   సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ.ఆర్.మురగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, తెలుగు రాష్ట్రాల లో ఏకంగా 750 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ముందు గా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలకు పూర్తీ చేసు కోగా అక్కడ నుండి ఎలాంటి టాక్ ని తెచ్చుకుందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా కానీ ఒక పోలిస్ కి ఒక రౌడీ గ్యాంగ్ కి మధ్య గొడవే సినిమా అంటున్నారు. ఇందులో రజినీ రివేంజ్ కూడా ఉంటుందట. అది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు. పెర్ఫార్మెన్స్ పరంగా…రజినీ దుమ్ము లేపాడట.

తన స్టైల్, ఎనర్జీ హీరోయిజం డైలాగ్స్ ఇలా అన్నింట ఫుల్ ఎనర్జీ తో ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా అనిపించాడట రజినీ.. మురగదాస్ రజినీ ని చూపెట్టిన విధానం అదుర్స్ అంటున్నారు. ఇక హీరోయిన్ నయనతార రోల్ ఉన్నంతలో బాగుందని సునీల్ శెట్టి విలనిజం కూడా ఆకట్టుకుందని అంటున్నారు.

అనిరుద్ సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం దుమ్ము లేపెశాడని అంటున్నారు. ముఖ్యంగా తలైవా అంటూ వచ్చే పాట బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ లో స్క్రీన్ పై ఉంటుందని అంటున్నారు. ఎడిటింగ్ స్క్రీన్ ప్లే బాగున్నా రొటీన్ కథ కాబట్టి ఎఫెక్టివ్ గా లేదని అంటున్నారు.

ఇక మురగదాస్ రొటీన్ కథ రజినీ కి పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యే విధంగా తెరకెక్కించాడని. కానీ కథ పరంగా పెద్దగా దమ్ము లేకపోయినా రజినీ ని ఫుల్ ఎనర్జిటిక్ రోల్ లో చూపెట్టి ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అంటే మాత్రం… ఫస్టాఫ్ వరకు అటు ఎంటర్ టైన్ చేస్తూ ఆకట్టుకోగా…

సెకెండ్ ఆఫ్ అక్కడక్కడా స్లో అవుతుందని, కొంచం ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలిగినా ఓవరాల్ గా వింటేజ్ రజినీ మ్యానియా తో సినిమా బాగుందనిపిస్తుందని అంటున్నారు. మరీ అద్బుతం కాదు కానీ సినిమా ఎబో యావరేజ్ రేంజ్ కి ఎక్కువగా హిట్ కి కొంచం అటూ ఇటూ గా ఉందని అంటున్నారు.

ఈ లెక్కన ఓవర్సీస్ నుండి సినిమా కి ఎబో యావరేజ్ కి పైగానే టాక్ వినిపిస్తుందని చెప్పొచ్చు. అక్కడ క్లాస్ ఆడియన్స్ కే ఎబో యావరేజ్ అనిపిస్తే ఇక్కడ రెగ్యులర్ మూవీ గోర్స్ కి సినిమా ఎక్కువగా నచ్చే చాన్స్ ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మరి రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

Darbar AP TG Theaters Count & Advance Bookings Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here