సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పేట బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయింది, ఓవర్సీస్ నుండి మంచి టాక్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు అసలు సిసలు రివ్యూ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ. ముందుగా కథ పాయింట్ విషయనికి వస్తే… ఒక హీరో అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్, తన గతాన్ని మర్చి కొత్త జీవితం ప్రారంభిస్తాడు… కానీ గతం తాలూకు…
పగ తన వెంట పడుతుంది, హీరో ఎలా తిరిగి అన్ని సెట్ చేశాడు అన్నది స్టొరీ పాయింట్, ఇలాంటి రొటీన్ రివెంజ్ స్టొరీ లు ఎన్నో ఎన్నెన్నో ఇప్పటి వరకు వచ్చాయి, మరి అలాంటి సినిమాల తో పోల్చితే పేట లో ఏముంది అంటే కేవలం వింటేజ్ రజినీ మ్యానియా అని చెప్పాలి.
భాషా, నరసింహ రేంజ్ లో జోష్ తో రజినీ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమే అయింది, అది గమనించిన దర్శకుడు కథ రొటీన్ దే ఎంచుకున్నా కానీ హీరోయిజం సీన్స్ తో రజినీ ఫ్యాన్స్ రజినీ నుండి ఏం కోరుకుంటున్నారో అవన్నీ సినిమా లో జోడించాడు.
కథ స్లో గా సాగినా కథనం ఆకట్టుకొక పోయినా రజినీ కోసం సినిమా ని ఒకసారి ఈజీగా చూసేఎచ్చు అన్న భావన థియేటర్ నుండి బయటికి వచ్చే సమయం లో ప్రతీ ఒక్కరి నుండి రావడం పక్కా.. కానీ కథ కొత్తగా ఉండాలి, కథనం జెట్ స్పీడ్ తో సాగాలి…
అనుకునే వారికి మాత్రం ఇదొక యావరేజ్ సినిమా గా అనిపిస్తుంది, మొత్తం మీద సినిమా మొత్తం రజినీ వన్ మ్యాన్ షో గా చెప్పుకోవచ్చు, మిగిలిన పాత్రల్లో త్రిషా, సిమ్రాన్, విజయ్ సేతుపతి మరియు నవాజుద్దిన్ ఆకట్టుకోగా వింటేజ్ రజినీ ముందు అందరు తేలిపోతారు..
అనిరుద్ అందించిన సంగీతం లో ఒకటి రెండు సాంగ్స్ బాగున్నా బ్యాగ్రౌండ్ స్కోర్ హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ ని ఓ రేంజ్ లో లేపాడు అనిరుద్, కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో కథ చాలా వీక్ గా ఉన్న కేవలం హీరోయిజం అండ్ రజినీ ని నమ్ముకుని చేసిన సినిమా ఇది.
మీరు రజినీ ఫ్యాన్ అయితే సినిమా ఎంజాయ్ చేయోచ్చు, కామన్ ఆడియన్స్ అయితే సినిమా జస్ట్ ఓకే అనిపిస్తుంది, ఫైనల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి. లేటెస్ట్ న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.