కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీస్ కి మునుపటిలా తెలుగు లో ఆశించిన మేర ఓపెనింగ్స్ కలెక్షన్స్ రావడం లేదు, కబాలి తర్వాత రజినీ మూవీస్ కి తెలుగు లో ఇబ్బందులు వస్తున్నాయి. ఎంచుకునే సినిమాలు కావొచ్చు లేక అవి రిలీజ్ అవుతున్న టైం కావచ్చు కారణం ఏదైనా అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై కూడా రజినీ ఇది వరకటి రేంజ్ లో దుమ్ము లేపి చాలా కాలమే అయింది.
లాస్ట్ రెండు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచి డైరెక్ట్ తెలుగు సినిమాల పోటి ని ఏమాత్రం తట్టుకోలేక నష్టాలను సొంతం చేసుకున్న రజినీ మూవీస్ టెలివిజన్ లో కూడా పెద్దగా మెప్పించలేదు. లాస్ట్ ఇయర్ మూవీ పేట టెలివిజన్ లో 3.94 రేటింగ్ ని మాత్రమె అందుకోగా…
ఈ ఇయర్ వచ్చిన దర్బార్ సినిమా కొంచం బెటర్ రేటింగ్ ని అందుకున్నా సినిమాను కొన్న రేటు ప్రకారం చూసుకుంటే నిరాశ పరిచింది అనే చెప్పాలి. సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 6.89 TRP రేటింగ్ దక్కగా తర్వాత రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు పర్వాలేదు అనిపించే విధంగా…
5.04 TRP రేటింగ్ ని సాధించింది. ఇక రీసెంట్ గా మూడో సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అయినా కానీ 3.45 TRP రేటింగ్ ని మాత్రమె అందుకుని షాక్ ఇచ్చింది. మొత్తం మీద మూడు సార్లు చూసుకుంటే డీసెంట్ గా హోల్డ్ చేసినట్లు అనిపించినా కానీ సినిమా ను కొన్న రేటు అటూ ఇటూ గా….
10 కోట్ల రేంజ్ లో ఉంటుంది అని ట్రేడ్ సమాచారం…. ఆ లెక్కన చూసుకుంటే మాత్రం సినిమా ఛానెల్ కి ఇంకా కొన్ని సార్లు టెలికాస్ట్ అయితే తప్పితే లాభాలు ఇవ్వడం కష్టమే అని అంటున్నారు. ఒకప్పటి వింటేజ్ రజినీ క్రేజ్ అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు బుల్లితెరపై తన అప్ కమింగ్ మూవీ తో సొంతం చేసుకోవాలని కోరుకుందాం….