Home గాసిప్స్ సూపర్ స్టార్ మాస్…ఓవర్సీస్ లో తన రేంజ్ చూపెట్టిన రజినీకాంత్!!

సూపర్ స్టార్ మాస్…ఓవర్సీస్ లో తన రేంజ్ చూపెట్టిన రజినీకాంత్!!

0

     సూపర్ స్టార్ రజినీ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తూ దూసుకు పోతున్నారు. లాస్ట్ ఇయర్ రోబో 2 తో దుమ్ము లేపిన రజినీ అంతకన్నా ముందు కాలా తో వచ్చారు. ఇక ఈ ఇయర్ స్టార్టింగ్ లో పెట్టా తో మరోసారి దుమ్ము లేపిన రజినీ ఇప్పుడు ఏ ఆర్ మురగదాస్ డైరెక్షన్ లో చేస్తున్న దర్బార్ తో మరో సారి సంక్రాంతి బరిలో రావడానికి సిద్ధం అవుతున్నాడు.

కాగా మురగదాస్ మరియు రజినీ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా అవ్వడం తో ఈ సినిమా పై అంచనాలు అయితే పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రజినీ ఈ సినిమా లో పోలిస్ గెటప్ లో కనిపించబోతుండటం తో మురగదాస్ ఎలా చూపించి ఉంటారు అని ఎదురు చూస్తున్నారు.

ఇక సినిమా బిజినెస్ పరంగా ముందుగా ఓవర్సీస్ లో బిజినెస్ ని పూర్తీ చేసుకుని దుమ్ము లేపింది. తన కెరీర్ లో ఆల్ టైం నంబర్ 1 బిజినెస్ ని ఓవర్సీస్ లో సొంతం చేసుకున్న సినిమా సౌత్ మూవీస్ లో కన్ఫాం అయిన సినిమాల్లో ఆల్ టైం మూడో బిగ్గెస్ట్ బిజినెస్ ని అందుకుంది.

అక్కడ బాహుబలి 2 కి 70 కోట్ల బిజినెస్ దక్కగా అది ఆల్ టైం రికార్డ్ గా నిలిచింది. ఇక రెండో ప్లేస్ లో ప్రభాస్ నటించిన సాహో సినిమా 42 కోట్ల బిజినెస్ తో టాప్ 2 లో ఉండగా ఇప్పుడు దర్బార్ సినిమా కి ఓవర్సీస్ లో మొత్తం మీద 35 కోట్ల బిజినెస్ దక్కింది. లాస్ట్ ఇయర్ వచ్చిన రోబో 2 సినిమా ని…

ఓవర్సీస్ లో ఓన్ గా రిలీజ్ చేసుకున్నారు దాంతో ఆ బిజినెస్ లెక్కలోకి రాలేదు. ఇక ఈ బిజినెస్ తో అక్కడ పెట్ట తో 34.5 కోట్లు, కబాలి 34 కోట్ల తో తన రికార్డులను తానె బ్రేక్ చేసుకున్నాడు సూపర్ స్టార్, ఇక సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ బరిలో ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను నమోదు చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here