Home న్యూస్ రజినీ “దర్బార్” రివ్యూ….ప్లస్ & మైనస్ పాయింట్స్!!

రజినీ “దర్బార్” రివ్యూ….ప్లస్ & మైనస్ పాయింట్స్!!

0

      సూపర్ స్టార్ రజనీ కాంత్ మురగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ ప్రీమియర్ షో లతో సినిమా కి ఎబో యావరేజ్ రేంజ్ టాక్ లభించ గా ఇప్పుడు ఇప్పుడు రెగ్యులర్ షోలకు సినిమా కి ఎలాంటి టాక్ లభించింది, ఫైనల్ గా సినిమా ఎలా ఉంది అన్న విశేషాలను తెలుసు కుందాం పదండీ..

కథ పాయింట్ కి వస్తే ముంబై పోలిస్ అయిన రజినీ డ్రగ్ అండ్ హ్యూమన్ మాఫియా ని అరికట్టడమే ధ్యేయంగా దూసుకుపోతాడు, దీంతో విలన్ తో గొడవ మొదలు అవ్వగా ఎలా ఎదిరించి నిలిచాడు అన్నది ఓవరాల్ కాన్సెప్ట్.. మధ్యలో ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది పూర్తిగా రజినీ వన్ మ్యాన్ షో గా చెప్పుకోవాలి, తన స్టైల్, హీరోయిజం యాక్టింగ్ అన్నీ ఓ 20 – 25 ఏళ్ల క్రితం ఉన్న ఎనర్జీ తో దుమ్ము లేపేశాడు రజినీ… ఇక హీరోయిన్ నయనతార ఉన్నంతలో ఆకట్టుకోగా, నివేదా థామస్ రోల్ మెప్పిస్తుంది.

మిగిలిన నటీనటులు ఉన్నంతలో ఆకట్టుకోగా సునీల్ శెట్టి విలనిజం ఆకట్టుకుంది, ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో అనిరుద్ దుమ్ము లేపాడు, పాటలు 2 బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కుమ్మేశాడు, హీరోయిజం ఎలివేట్ సీన్స్ లో ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయమని చెప్పొచ్చు.

ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగానే ఉండగా సెకెండ్ ఆఫ్ మాత్రం స్లో అయింది, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్లో గా ఉంటుంది, సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అని చెప్పొచ్చు. ఇక డైరెక్షన్ పరంగా మురగదాస్ సినిమాల్లోకి ఇది వీక్ కథగా చెప్పుకోవాలి.

సింపుల్ స్టొరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా రజినీ రీసెంట్ టైం లో ఎప్పుడూ చూడనంత యాక్టివ్ గా హీరోయిజం సీన్స్ తో చూపించాడు మురగదాస్, కానీ కథ పరంగా తన మునుపటి ఫామ్ లో లేడని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఫ్యాన్స్ ని దృష్టి లో పెట్టుకుని చేసిన సినిమా ఇదని చెప్పాలి.

Darbar AP TG Theaters Count & Advance Bookings Report!!

ఇక హైలెట్స్ విషయానికి వస్తే రజినీ వన్ మ్యాన్ షో, అదిరి పోయే బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ అండ్ సెకెండ్ ఆఫ్ 2 ఫైట్స్ మేజర్ హైలెట్స్ గా నిలుస్తాయి. ఇక మైనస్ ల విషయానికి వస్తే రొటీన్ కథ, వీక్ ఫ్లాష్ బ్యాక్ అండ్ స్లో సెకెండ్ ఆఫ్ మైనస్ లు గా నిలుస్తాయి.

Darbar Worldwide Pre Release Business

ఓవరాల్ గా సినిమా మరీ భీభత్సం కాదు కానీ ఉన్నంతలో ఈజీ గా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది, కామన్ ఆడియన్స్ ఒకసారి చూసే విధంగా సినిమా ఉందని చెప్పొచ్చు. ఇక రెగ్యులర్ ఆడియన్స్ సినిమాను ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అన్నదానిపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఫైనల్ సినిమా కి మా రేటింగ్ [2.75 స్టార్స్]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here