సూపర్ స్టార్ రజినీకాంత్ పా.రంజిత్ ల కాంబినేషన్ లో వచ్చిన కబాలి జస్ట్ టీసర్ అండ్ ఒక సాంగ్ తో అల్టిమేట్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. కానీ సినిమా అంచనాలను అందుకునే విధంగా లేకపోవడంతో భారీ ఫ్లాఫ్ గా మిగిలినా కానీ తమిళ్ ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసింది. కానీ తెలుగు లో మాత్రం 23 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించి 40 కోట్ల బిజినెస్ కి 17 కోట్ల లాస్ దక్కించుకుంది.
మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన కాలా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా కబాలి కన్నా బెటర్ టాక్ తెచ్చుకున్నా ఓవరాల్ గా యావరేజ్ టాక్ తో తెలుగు లో ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్స్ ని సాధించి భారీ డిసాస్టర్ గా నిలిచింది ఈ సినిమా..
టోటల్ రన్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
Nizam- 3.72 cr
Ceded-1.15
UA-1.3
West-0.53
East-0.55
Guntur-0.56
Krishna-0.65
Nellore-0.32
Total AP & TS Share 8.78 Cr
33 కోట్ల బిజినెస్ కి 8.78 కోట్ల షేర్ అంటే ఇది మామూలు డిసాస్టర్ కాదనే చెప్పాలి. రోబో తర్వాత రజినీ కెరీర్ లో క్లీన్ హిట్ కోసం 8 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. తమిళ్ ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా టోటల్ గా తెలుగు తో కలిపి 150 కోట్ల వరకు గ్రాస్ ని అందుకుందని అంటున్నారు, ఆ లెక్కన చూసుకున్న టోటల్ 155 కోట్ల బిజినెస్ కి 290 కోట్ల గ్రాస్ ని సినిమా సాధించాల్సి ఉంటుంది. కానీ 75 కోట్ల షేర్ ని మాత్రమే సాధించి భారీ డిసాస్టర్ గా నిలిచిపోయింది ఈ సినిమా.