Home న్యూస్ రంగబలి….థియేటర్స్, బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

రంగబలి….థియేటర్స్, బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంగా ఓ మంచి హిట్ మూవీ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో నాగ శౌర్య(Naga Shaurya) నటించిన కొత్త సినిమా రంగబలి(Rangabali Pre Release Business) ఆడియన్స్ ముందుకు భారీ ఎత్తున ఈ శుక్రవారం రిలీజ్ కాబోతూ ఉండగా…

సినిమా పై ఆడియన్స్ లో పర్వాలేదు అనిపించేలా బజ్ ఏర్పడగా రీసెంట్ గా సినిమాలో నటించిన సత్య తో చేసిన కామెడీ ఇంటర్వూలు బాగానే వైరల్ అవ్వడంతో సినిమా మంచి ప్రమోషన్స్ నే సొంతం చేసుకుంది. ఇక సినిమా మొత్తం మీద నైజాంలో….

120 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఆంధ్రలో 180 వరకు థియేటర్స్ లో సీడెడ్ లో 45 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్ గా 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న…

రంగబలి సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ 4.5 కోట్ల దాకా ఉంటుందని అంచనా వరల్డ్ వైడ్ గా 5.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ఉంటుందని అంచనా… దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే…

6.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అని చెప్పొచ్చు. సినిమా ట్రైలర్ కూడా డీసెంట్ గానే ఉండటంతో సినిమా ఆడియన్స్ ను అనుకున్న విధంగా మెప్పిస్తే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here