రిలీజ్ అయిన మొదటి రోజు నుండి నాన్ స్టాప్ రికార్డులతో దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతున్న ఉప్పెన సినిమా సెన్సేషనల్ రన్ ని అలాగే కొనసాగిస్తుంది, సినిమా మూడో వారం కొత్త సినిమాలు మళ్ళీ రిలీజ్ అయినా కానీ సెన్సేషనల్ అనిపించే విధంగా 360 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసి రన్ ని కొనసాగించగా 14 వ రోజు తో పోల్చితే 15 వ రోజు కలెక్షన్స్ ఎక్కువ రావడం ఇక్కడ విశేషం…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 15 రోజులు పూర్తీ అయ్యే టైం కి 47 కోట్ల మార్క్ ని అధిగమించి 47.08 కోట్ల తో సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో రికార్డ్ ను ఇప్పుడు బ్రేక్ చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పాలి.
టాలీవుడ్ లో ఫిబ్రవరి నెలకు గాను హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమా 2013 లో 70-80 టికెట్ రేటు తోనే రికార్డ్ కొట్టింది. టోటల్ రన్ లో 48.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…
ఆ రికార్డ్ ను తర్వాత టైం లో ఏ సినిమా అందుకోలేదు, ఫిబ్రవరిలో రిలీజ్ అయిన తర్వాత బిగ్ మూవీస్ ఎన్టీఆర్ టెంపర్ క్లోజ్ గా వచ్చినా రికార్డ్ బ్రేక్ చేయలేదు, కానీ ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి సిద్ధం అయ్యింది ఉప్పెన సినిమా… 8 ఏళ్ళుగా ఉన్న ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి…
ఉప్పెన సినిమా మరో 1.42 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే సరిపోతుంది. ఈ కలెక్షన్స్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ అనుకున్నట్లు జరిగితే వీకెండ్ కలెక్షన్స్ తో బ్రేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అల్టిమేట్ కలెక్షన్స్ తో జోరు చూపుతూ దూసుకు పోతున్న ఉప్పెన సినిమా ఈ కలెక్షన్స్ ని క్రాస్ చేసి 50 కోట్ల వైపు అడుగు వేయడం పక్కాగా కనిపిస్తుంది…