Home న్యూస్ లైగర్ రివ్యూ….ఏంటి సామి ఇదీ!!

లైగర్ రివ్యూ….ఏంటి సామి ఇదీ!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన మూవీ లైగర్… ఆల్ మోస్ట్ 3000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా భారీ గానే రిలీజ్ అవ్వగా ఎంతవరకు అంచనాలను తట్టుకుందో తెలుసు కుందాం పదండీ…

ముందుగా స్టొరీ పాయింట్ కి వస్తే మార్షల్ ఆర్ట్స్ తో తన కోడుకుని చాంపియన్ లా చూడాలని కరీంనగర్ నుండి ముంబైకి తల్లి కొడుకులు అయిన రమ్యకృష్ణ మరియు విజయ్ దేవరకొండలు వెళతారు… అక్కడ తన లక్ష్యం వైపు అడుగులు వేసే హీరో హీరోయిన్ తో లవ్ లో పడతాడు…. తర్వాత ఏం జరిగింది, హీరో ఎలా చాంపియన్ అయ్యాడు… ఇంతకీ మైక్ టైసన్ క్యారెక్టర్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

స్టొరీ పాయింట్ ఆల్ మోస్ట్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయిని పోలి ఉన్నప్పటికీ పూరీలో ఒకప్పటి కసి మాత్రం కనిపించలేదు…. అతి సాధారణమైన స్టొరీ పాయింట్ ని తీసుకుని హీరోకి అస్సలు సెట్ అవ్వని నత్తిని జోడించిన పూరీ ఏ దశలో కూడా డైరెక్టర్ గా తన పవర్ ని చూపించలేదు… హీరో పవర్ ఫుల్ గా ఉన్నా కానీ…

LIGER Movie Total Pre Release Business Details!

తన క్యారెక్టర్ తన ఇతర మాస్ హీరోల రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి. కానీ సినిమాని నిలబెట్టడానికి విజయ్ దేవరకొండ ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డా కానీ తనకి నత్తి అస్సలు సెట్ కాక పోవడం, లవ్ ట్రాక్ చాలా వీక్ గా ఉండటం, కథలో అసలు సత్తా లేక పోవడంతో సినిమా కోసం విజయ్ దేవరకొండ పడ్డ కష్టం అంతా వృధా అయింది అని చెప్పాలి.

తన రోల్ వరకు తను బాగానే పెర్ఫార్మ్ చేయగా, హీరోయిన్ అనన్య పాండే రోల్ మట్టుకు చిరాకు తెప్పిస్తుంది. ఇద్దరి లవ్ స్టొరీ పూరీ మూవీస్ లో వీకేస్ట్ అని చెప్పాలి. ఇక రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్ బాగున్నా ఆ రోల్ చేసే ఓవర్ యాక్షన్ బరించడం కష్టమే. ఇక మైక్ టైసన్ రోల్ మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయలేదు అని చెప్పాలి.

సంగీతం విషయానికి వస్తే కంప్లీట్ గా బాలీవుడ్ స్టైల్ లో ఉన్న సాంగ్స్ పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ గా ఉంటుంది, ఎడిటింగ్ చాలా వీక్ గా ఉండగా సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి… మార్షల్ ఆర్ట్స్ బాక్సింగ్ నేపధ్యంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా తక్కువే అని చెప్పాలి…

మొత్తం మీద సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే…. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్, తల్లి కొడుకుల మధ్య వచ్చే సీన్స్, 2 సాంగ్స్ అని చెప్పాలి, ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, లవ్ ట్రాక్, సెకెండ్ ఆఫ్ ఇలా మైనస్ లు చాలానే ఉన్నాయి సినిమాలో… మొత్తం మీద లైగర్ సినిమా….

ఫక్తు మాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు కానీ రీసెంట్ టైం లో ఒకటికి మించి ఒకటి డిఫెరెంట్ నావెల్ స్టొరీ పాయింట్స్ తో వచ్చిన సినిమాలు చూసిన తర్వాత ఇలాంటి కథని యాక్సెప్ట్ చేయడం కష్టమే అని చెప్పాలి. అయినా కానీ ఓపికతో కష్టపడి చూస్తె సినిమా యావరేజ్ లెవల్ లో అనిపించవచ్చు… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here