కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఊచకోత కోసింది. సినిమా మొత్తం మీద మూడో రోజు కలెక్షన్స్ ని పరిశీలిస్తే… హిందీ లో 30 కోట్ల గ్రాస్ ని, తెలుగు లో 10 కోట్ల గ్రాస్ ని, తమిళ్ లో 12 కోట్ల గ్రాస్ ని, కర్ణాటక మరియు కేరళలో 8 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఇండియా లో 60 కోట్ల గ్రాస్ ని అందుకున్న సినిమా ఓవర్సీస్ లో 25 కోట్ల గ్రాస్ ని అందుకుంది.
దాంతో 3 వ రోజు టోటల్ గా 85 కోట్ల గ్రాస్ ని అందుకోగా తొలి రెండు రోజుల్లో అన్ రిపోర్ట్టెడ్ ఏరియాల్లో సినిమాకి 15 కోట్ల గ్రాస్ వచ్చిందట. దాంతో రెండు రోజుల టోటల్ లెక్క ఇప్పుడు 180 కోట్లు అయింది. టోటల్ గా మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని చూస్తె…
హిందీ లో 80 కోట్ల గ్రాస్ ని, తెలుగు లో 40 కోట్ల గ్రాస్ ని, తమిళ్ లో 45 కోట్ల గ్రాస్ ని, కర్ణాటక లో 18 కోట్లు మరియు కేరళలో 10.5 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఇండియా లో 193.5 కోట్ల గ్రాస్ ని అందుకున్న సినిమా ఓవర్సీస్ లో 72 కోట్ల గ్రాస్ ని అందుకుంది.
దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 265.5 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నట్లు సమాచారం. ఇక టోటల్ గా షేర్ వివరాలు టోటల్ వరల్డ్ వైడ్ గా 133 కోట్లకు పైగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజంగానే భీభత్సం అని చెప్పాలి.
ఇక సినిమా 360 కోట్ల బిజినెస్ కి ఇప్పటికే 133 కోట్ల షేర్ ని రికవరీ చేయడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇంకా 230 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ జోరు ఎలా ఉంటుందో చూడాలి.