బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక డబ్బింగ్ మూవీ కి ఒరిజినల్ వర్షన్ కన్నా ఎక్కువ క్రేజ్ అండ్ కలెక్షన్స్ రావడం చాలా అరుదు అని చెప్పాలి. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తమిళ్ కన్నా తెలుగు లో ఎక్కువగాను స్టడీ గాను ఉండటం ఇప్పుడు అందరికీ షాకింగ్ గా అనిపిస్తుంది. కారణాలు తెలియకున్నా సినిమా తమిళనాడు లో భారీ గా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది.
అక్కడ మిగిలిన హీరోల క్రేజ్ ఒకెత్తు రజినీ క్రేజ్ మరో ఎత్తు అనుకునేవాళ్ళకి కూడా షాక్ ఇస్తూ రీసెంట్ బిగ్ మూవీ సర్కార్ తో పోల్చితే రెండు రోజుల కలెక్షన్స్ భారీ షాక్ నే ఇచ్చాయి. సర్కార్ మొదటి రోజు 31 కోట్లు, రెండో రోజు 24 కోట్ల గ్రాస్ ని అందుకోగా…
రోబో 2 మొదటి రోజు 20 కోట్లు, రెండో రోజు 13 కోట్లు గ్రాస్ ని అందుకుని షాక్ ఇవ్వడంతో కారణాలు తెలియకున్నా ఫ్యాన్ వార్స్ అలాగే రజినీ రాజకీయాలకు ఎంటర్ అవ్వడంతో యాంటీ ఫ్యాన్స్ పెరిగారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ రోబో 2 అక్కడ సాధించాల్సిన టార్గెట్ 120 కోట్ల షేర్ ని అందుకోవాలి కాబట్టి ఈ జోరు సరిపోదనే చెప్పాలి.