Home న్యూస్ బాలీవుడ్ లో రీ రిలీజ్ లో రాక్ స్టార్ రికార్డ్ కలెక్షన్స్ జాతర!

బాలీవుడ్ లో రీ రిలీజ్ లో రాక్ స్టార్ రికార్డ్ కలెక్షన్స్ జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ మన దగ్గర కొంత టైం క్రితం పీక్ లో ఉండేది, కానీ ఇప్పుడు రీ రిలీజ్ లు మరీ ఓవర్ డోస్ అయిపోవడంతో మన దగ్గర రీ రిలీజ్ లకు అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వడం లేదు, ఇక ఈ టైంలో కోలివుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ జోరు అందుకోగా బాలీవుడ్ లో కూడా ఇప్పుడు రీ రిలీజ్ ల ట్రెండ్…

మొదలు అవ్వగా 2011 టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి క్లాసిక్ అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన రాక్ స్టార్(RockStar Movie Re Release) సినిమాను రీ రిలీజ్ చేశారు..కాగా రీ రిలీజ్ అయిన మొదటి వారాల్లో పెద్దగా జోరుని చూపించలేక పోయిన ఈ సినిమా….

పెద్దగా కొత్త సినిమాలు ఏమి లేక పోవడంతో మెల్లిమెల్లిగా పుంజుకున్న ఈ సినిమా స్టడీ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను రీ రిలీజ్ లో కూడా సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 30 రోజులకు పైగా థియేటర్స్ లో రీ రిలీజ్ రన్ ని కొనసాగించిన ఈ సినిమా ఇప్పటికీ రోజుకి 8-10 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ ఇప్పటికీ రన్ ని దక్కించుకుంటూ ఉండగా…

ఇప్పటి వరకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా….బాలీవుడ్ లో రీ రిలీజ్ ల మూవీస్ లో ఇవి వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఇప్పటికీ స్టడీగా కలెక్షన్స్ ని అందుకుంటున్న సినిమా టోటల్ రన్ లో రీ రిలీజ్ లో మొత్తం మీద 9 -10 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here