పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రొమాంటిక్, కంప్లీట్ గా యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తెరకెక్కించిన ఈ లవ్ స్టొరీ మంచి పబ్లిసిటీని ఆల్ రెడీ సొంతం చేసుకుంది అని చెప్పాలి. పూరీ జగన్నాథ్ సినిమా కోసం సాలిడ్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేయగా సినిమా ప్రమోషన్ పనులను పూర్తీ చేసుకుని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది…
ముందుగా సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే… నైజాం లో సినిమా 1.6 కోట్ల బిజినెస్ ను అందుకోగా సీడెడ్ ఏరియా లో 1 కోటి బిజినెస్ ను సాధించింది… ఇక ఆంధ్ర రీజన్ లో 1.5 కోట్ల రేటు కి బిజినెస్ క్లోజ్ అయ్యింది…
దాంతో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4.10 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా వరల్డ్ వైడ్ బిజినెస్ 4.6 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవుతుంది.
ఇక సినిమా మొత్తం మీద నైజాం లో 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా సీడెడ్ లో 75 థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక టోటల్ ఆంధ్రలో 210 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 485 థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా….
630 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 5 కోట్ల టార్గెట్ ను సినిమా 630 థియేటర్స్ లో అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు కానీ సినిమా ఎంతవరకు టార్గెట్ చేసిన యూత్ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించి ఈ టార్గెట్ ను అందుకుంటుందో లేదో అనేది ఆసక్తిగా మారింది అని చెప్పాలి.