Home టోటల్ కలెక్షన్స్ బడ్జెట్ 42 కోట్లు..బిజినెస్ 25.8 కోట్లు…టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్

బడ్జెట్ 42 కోట్లు..బిజినెస్ 25.8 కోట్లు…టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్

0

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సాక్ష్యం…భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 42 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం మీద 25.8 కోట్లు అయ్యింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 27 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.

టాక్ బాగానే ఉన్నా వీకెండ్ వసూళ్లు పర్వాలేదు అనిపించినా తర్వాత జోరు చూపలేక చేతులు ఎత్తేసిన ఈ సినిమా టోటల్ గా బాక్స్ ఆఫీస్ రన్ లో 11.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో భారీ నష్టాలను మిగిలించింది ఈ సినిమా.

సుమారు 14 కోట్ల నష్టాలను మిగిలించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా మిగిలిపోయింది. మంచి టాక్ తెచ్చుకున్నా ఓపెనింగ్స్ వచ్చినా ఎందుకనో వర్కింగ్ డేస్ లో బెల్లంకొండ సినిమాలన్నీ భారీ గా డ్రాప్ అవ్వడమే ఈ ఫ్లాఫ్స్ కి కారణం అంటున్నారు. మరి తర్వాత సినిమాతో అయినా హిట్ కొడతాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here