Home న్యూస్ సైంధవ్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

సైంధవ్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ సైంధవ్(Saindhav Movie Review Telugu) వరల్డ్ వైడ్ గా ఉన్నంతలో భారీగానే రిలీజ్ అయింది. భారీ పోటిలో రిలీజ్ అయిన సైంధవ్ మూవీ ఆడియన్స్ అంచనాలను ఎంతవరకు అందుకోగలిగిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే….హార్బర్ లో పనిచేసే హీరోకి ఓ భారీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది ఎవ్వరికీ చెప్పకుండా తన కూతురితో కలిసి సంతోషంగా ఉంటున్న హీరో లైఫ్ ఒక్కసారిగా టర్న్ అవుతుంది, ఒక తీవ్ర వ్యాధి వలన తన కూతురి ప్రాణాపాయ స్థితిలో ఉండగా 17 కోట్ల రేటు ఉండే ఒక ఇంజెక్షన్ అవసరం అవుతుంది. 

ఆ ఇంజెక్షన్ కొనడానికి డబ్బులు కావాలి, మరి అప్పుడు హీరో ఏం చేశాడు, ఇంతకీ తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… విక్టరీ వెంకటేష్ మరో సారి హార్ట్ టచింగ్ సెంటి మెంట్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు, ఈ సారి ఊరమాస్ యాక్షన్ సీన్స్ తో కూడా రచ్చ చేశాడు, తన స్క్రీన్ ప్రజెన్స్ ఇప్పటికీ ఎక్స్ లెంట్ గా ఉండటం విశేషం. 

శ్రద్దా శ్రీనాద్ పర్వాలేదు అనిపించగా, పాప కూడా బాగా నటించింది, ఆర్య, నవాజుద్దీన్ సిద్దిఖి, ఆండ్రియా, రుహాని శర్మ ఇలా భారీ స్టార్ కాస్ట్ ఉండగా ఉన్నంతలో తమ తమ రోల్స్ లో పర్వాలేదు అనిపించారు. సంగీతం ఒకటి రెండు పాటలు బాగున్నా కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ ఏమాత్రం ఎఫెక్టివ్ గా లేదు…బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుంటే ఫైట్ సీన్స్ ఇంకా బెటర్ గా ఎలివేట్ అయ్యేవి…

ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు పడుతూ లేస్తూ సాగినా ఓవరాల్ గా బాగానే ఉన్నా కూడా సెకెండ్ ఆఫ్ లో మాత్రం ట్రాక్ తప్పింది, ప్రీ క్లైమాక్స్ నుండి తెరుకున్నా మధ్యలో చాలా టైం బోర్ ఫీల్ అయ్యేలా చేసిందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గానే ఉన్నాయి.

ఇక డైరెక్షన్ విషయానికి వస్తే మంచి పాయింట్ నే తీసుకున్న శైలేష్ కొలను మరీ హిట్ సిరీస్ మాదిరిగా స్క్రీన్ ప్లే రాసుకోలేక పోయాడు, ఉన్నంతలో ఫస్టాఫ్ వరకు బాగున్నా సెకెండ్ ఆఫ్ లో చాలా టైం కథ రిపీటివ్ గా, నరేషన్ చాలా స్లోగా సాగడంతో ట్రాక్ తప్పినట్లు అనిపించగా తిరిగి క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా తీసి పర్వాలేదు అనిపించాడు…

మొత్తం మీద సినిమాలో విక్టరీ వెంకటేష్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్, ఫైట్ సీన్స్ మరియు క్లైమాక్స్ లు ప్లస్ పాయింట్స్ అయితే, నరేషన్ స్లో గా ఉండటం, సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అవ్వడం, బ్యాగ్రౌండ్ స్కోర్ వీక్ గా ఉండటం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్….

పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్స్ వెళ్ళే ఆడియన్స్ కొంచం ఓపిక పట్టి చూస్తె పార్టు పార్టులుగా సైంధవ్ సినిమా ఒకసారి చూసేలా అనిపించవచ్చు, అలా కాదని వెంకటేష్ 75వ సినిమా కాబట్టి ఎదో స్పెషల్ ఉంటుంది అని భారీ అంచనాలతో వెళితే మట్టుకు కొంచం నిరాశ పరుస్తుంది సినిమా….ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here