Home న్యూస్ సైంధవ్ టీసర్ 24 గంటల రిపోర్ట్…బానే కుమ్మిందిగా!!

సైంధవ్ టీసర్ 24 గంటల రిపోర్ట్…బానే కుమ్మిందిగా!!

0

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఆడియన్స్ ముందుకు సోలో హీరోగా ఇప్పుడు భారీ యాక్షన్ మూవీతో రావడానికి సిద్ధం అవుతున్నాడు…. రీసెంట్ టైంలో చాలా వరకు క్లాస్ మూవీస్ చేసిన వెంకీ నారప్ప(Naarappa) లాంటి ఊరమాస్ మూవీ చేసినా ఆ సినిమా డిజిటల్ లోనే డైరెక్ట్ గా రిలీజ్ అయింది.

దాంతో వెంకటేష్ మాస్ మూవీలో చూడాలి అన్న ఆశ అలానే ఉండగా ఇప్పుడు హిట్ సిరీస్ తో ఫేమస్ అయిన శైలేష్ కొలను డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా చేస్తున్న సైంధవ్(Saindhav) మూవీ ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా రీసెంట్ గా సినిమా టీసర్ ను రిలీజ్ చేశారు, టీసర్ చూసిన తర్వాత ఇది వెంకటేష్ కి విక్రమ్ రేంజ్ మూవీలా అనిపించింది…

యాక్షన్ సీన్స్ వెంకటేష్ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్స్ లెంట్ విజువల్స్, సూపర్బ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ టీసర్ లో హైలెట్ అవ్వగా ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ టీసర్ కి యూట్యూబ్ లో మొత్తం మీద 24 గంటల్లో మంచి రెస్పాన్స్ సొంతం అయింది…

24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ టీసర్ కి 5.61 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా ఈ టీసర్ కి 103K లైక్స్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పొచ్చు. ఓవరాల్ గా సీనియర్ హీరోలలో సినిమాలు చాలా రేర్ గా చేస్తున్న వెంకీ మూవీకి ఇది మంచి రెస్పాన్స్ అనే చెప్పాలి.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఏమాత్రం టాక్ విక్రమ్ లెవల్ లో వచ్చినా వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో ఈ సినిమా ఓ రేంజ్ లో రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here