ఏడాదిన్నర క్రితం సెన్సేషనల్ రాంపెజ్ ను చూపించిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన మాస్ మూవీ సలార్(Salaar Movie), భారీ పోటి అలాగే భారీ డిలే వలన అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది. అయినా కూడా ఉన్నంతలో 600 కోట్లకు పైగా గ్రాస్ ను దక్కించుకాగా..
సినిమా తర్వాత డిజిటల్ లో మాస్ కొట్టుడు కొట్టింది. ఇప్పటికీ సినిమా ఎలివేషన్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉండగా ఇప్పుడు సినిమా ఈ నెల 21న గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…పెద్దగా పోటి ఏమి లేక పోవడంతో…
ఈ వీక్ లో ఈ సినిమానే ఫేవరేట్ గా బరిలోకి దిగుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇండియాలో ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న సలార్ మూవీ ఇప్పుడు, రిలీజ్ కి ఇంకా 3 రోజుల వరకు టైం ఉండగానే…
మొదటి రోజుకి గాను ఏకంగా కోటి రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. రీసెంట్ గా మార్చ్ నెలలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేయగా…
ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఇండియాలో ఏమాత్రం తగ్గకుండా సలార్ సినిమా బుకింగ్స్ లో కుమ్మేయగా ఓవర్సీస్ లో SVSC సినిమా సాలిడ్ బుకింగ్స్ ను సాధించింది. సలార్ అక్కడ ప్రస్తుతానికి ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉండగా…
ఓవరాల్ గా సలార్ జోరు చూస్తుంటే రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ ని ఓపెనింగ్స్ లో సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ ని ఈ అన్ సీజన్ లో థియేటర్స్ లో గట్టిగా ఎంజాయ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.