బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ అయిన మార్చ్ నెలలో ఆడియన్స్ ముందుకు రీ రిలీజ్ వస్తూ ఉండగా…నెల స్టార్టింగ్ లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మాస్ రచ్చ చేయగా…ఇప్పుడు ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన మాస్ మూవీ సలార్(Salaar Movie)సినిమా….
గ్రాండ్ గా ఇండియాలో రీ రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ ప్రీ బుకింగ్స్ తో రచ్చ చేసిన ఈ సినిమా రిలీజ్ కి ముందు రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా… ఇక రిలీజ్ రోజున అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో….
ఓపెన్ అయ్యి దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…హైదరాబాదు లో షోలు సాలిడ్ గా ఫుల్స్ పడగా…మాస్ సెంటర్స్ లో సైతం సినిమా కి ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీ సొంతం అవుతూ ఉండగా….చాల చోట్ల సినిమా కి షోలు…
ఫుల్ అవుతూ ఉండగా…ఓవరాల్ గా రోజు మొత్తం ఇదే రేంజ్ లో ట్రెండ్ కొనసాగిస్తే సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు యూత్ ఎక్కువగా వెళ్ళే అవకాశం కూడా ఉన్న నేపధ్యంలో…
ఓవరాల్ గా రీ రిలీజ్ లో ప్రభాస్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోబోతున్న సలార్….మొత్తం మీద టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక డే 1 రీ రిలీజ్ లో ఎలాంటి వసూళ్ళని సినిమా అందుకుంటుందో చూడాలి.