బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన మాస్ మూవీ సలార్(Salaar Movie)సినిమా గ్రాండ్ గా రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆల్ మోస్ట్ 1.8 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొదటి రోజు ఇతర కొత్త సినిమాల కన్నా కూడా…
బెటర్ ట్రెండ్ ను చూపించి మంచి జోరు ని చూపించింది….ఆల్ మోస్ట్ 27 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను రీ రిలీజ్ రోజున సొంతం చేసుకుని ఈ సినిమా మాస్ రచ్చ చేయగా…. ఓవరాల్ గా ప్రీ బుకింగ్స్ డే 1 ట్రాక్ చేసిన సెంటర్స్ నుండి గ్రాస్ ఎక్స్ లెంట్ గా ఉండటం విశేషం అని చెప్పాలి.
ఒక్క నైజాం లోనే సినిమా మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో నుండి 1.1 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను అందుకోగా…. ఆంధ్ర మరియు సీడెడ్ లు కలిపి సినిమా 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండే…
మొదటి రోజున 2.35 కోట్ల రేంజ్ లో ట్రాకుడ్ గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. దాంతో టోటల్ గా మొదటి రోజు ట్రాక్ చేసిన గ్రాస్ లెక్క 2.60 కోట్ల రేంజ్ లో ఉండగా…ఆఫ్ లైన్ లెక్కలు మొత్తం మీద…
అనుకున్న రేంజ్ లో ఉంటే ఓవరాల్ గా మొదటి రోజు లెక్క ఇంకా సాలిడ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా అన్ సీజన్ లో రీసెంట్ టైంలోనే వచ్చిన రీ రిలీజ్ తో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేశారు. ఇక ఫైనల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.