బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖన(Salman Khan) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్3(Tiger3 Movie) రీసెంట్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా ఓపెనింగ్స్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అందరూ అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు…
తొలిరోజు వరల్డ్ వైడ్ గా 94 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ సినిమా ఈ ఇయర్ రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ టాప్ 5 ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచింది, కానీ టాప్ ప్లేస్ లో కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లియో(Leo Movie) 146.15 కోట్లతో టాప్ లో ఉండగా….
సల్మాన్ ఖాన్ టైగర్ 3 కి ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఉందీ అనుకున్నా అలాంటిది ఏమి జరగలేదు. ఇక ఈ ఇయర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న బిగ్గెస్ట్ మూవీస్ లో షారుఖ్ ఖాన్(shah rukh khan) డంకి(Dunki) మూవీ ఒకటి కాగా మరోటి రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సలార్(Salaar Movie) లు నిలిచాయి.
డంకి కి లాంగ్ రన్ ఉండొచ్చు ఏమో కానీ ఓపెనింగ్స్ మాత్రం సలార్ కే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, పాన్ ఇండియా రేంజ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన సలార్ కి తొలిరోజు లియో ఓపెనింగ్స్ ను టార్గెట్ చేసే అవకాశం బ్రేక్ చేసే ఛాన్స్ ఎంతైనా ఉన్నాయి అని చెప్పాలి…
ఒకవేళ మొదటి రోజు సోలో రిలీజ్ కనుక దొరికితే భారీ మార్జిన్ ను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పొచ్చు. మరి లియోని సల్మాన్ ఖాన్ అయితే కొట్టలేక పోయాడు. ఇక రెబల్ స్టార్ ఈ రికార్డ్ ను కొట్టేసి బిగ్ మార్జిన్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేస్తాడో లేదో చూడాలి.