బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక స్టేజ్ లో బాలీవుడ్ ఖాన్స్ లో వరుస హిట్స్ తో ఒక డికేట్ మొత్తాన్ని ఏలిన సల్మాన్ ఖాన్(Salman Khan) రీసెంట్ టైంలో అనుకున్న రేంజ్ లో హిట్స్ ను అయితే సొంతం చేసుకోలేక పోతున్నాడు…ఒకప్పటిలా సల్మాన్ సినిమాలను చూడటానికి ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడటం లేదు..ఇలాంటి టైంలో…
సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లో ఒకరైన ఏ ఆర్ మురగదాస్ డైరెక్షన్ లో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేస్తున్న లేటెస్ట్ మూవీ అయిన సికిందర్(Sikandar Movie) సినిమా ఈ రంజాన్ కానుకగా ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ కాబోతుంది…
ఈ నెల 30 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ నే ఈ ట్రైలర్ సొంతం చేసుకుంది. సరైన బ్యాగ్రౌండ్ స్కోర్ పడి ఉంటే మట్టుకు ఇంకా రెస్పాన్స్ సాలిడ్ గా ఉండేది కానీ…
ఉన్నంతలో సల్మాన్ ఖాన్ లుక్స్ కానీ, మురగదాస్ టేకింగ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి కానీ స్టోరీ పాయింట్ కొంచం మురగదాస్ ఇది వరకు విజయ్ తో తీసిన సర్కార్ ను కొంచం మార్చి తీస్తున్నట్లు అనిపించింది ట్రైలర్ చూస్తుంటే….
కానీ మినిమమ్ గ్యారెంటీ ఔట్ పుట్ గా సినిమా ఉండబోతుంది అని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తూ ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ టాక్ వచ్చినా సల్మాన్ క్రేజ్ పవర్ తో మాస్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.
ఇక సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఏకంగా 47.66 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా లైక్స్ పరంగా 778K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్పాన్స్ ను సాధించింది. ఇక సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.