బాక్స్ ఆఫీస్ దగ్గర హీరోగా చేసిన మొదటి సినిమా హృదయ కాలేయం సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంపూర్నేష్ బాబు తర్వాత అడపా దడపా సినిమాలు చేసినా చేసినా ఆశించిన విజయం అయితే దక్కలేదు. ఇలాంటి టైం లో మళ్ళీ హృదయ కాలేయం టీం తో కలిసి చేసిన కొబ్బరి మట్ట సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని హిట్ అయింది.
తర్వాత మళ్ళీ జోరు పెంచిన సంపూ వరుస పెట్టి సినిమాలను కమిట్ అవుతూ ఉండగా ఈ లాక్ డౌన్ టైం లో ఒక భారీ సినిమా కమిట్ అయ్యాడు, ఆ సినిమానే కరోనా వైరస్ పై పారడీ గా తెరకెక్కుతున్న కొత్త సినిమా.. ఊహన్ లో పుట్టిన వైరస్…
ప్రపంచాన్ని ఎలా వణికించింది, దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు అనే కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ సినిమా పోస్టర్స్ ని సంపూర్నేష్ బర్త్ డే కానుకగా అప్పట్లో రిలీజ్ చేశారు, కానీ తర్వాత సినిమా పై పెద్దగా ఎలాంటి అప్ డేట్ అయితే ఇప్పటి వరకు రాలేదు.
కాగా ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా బడ్జెట్ గురించిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, సంపూ రీసెంట్ మూవీస్ అన్నీ కూడా 2 కోట్ల రేంజ్ బడ్జెట్ లోపే తెరకెక్కగా ఈ సినిమా కి ఏకంగా 5-6 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించ బోతున్నారని ఇండస్ట్రీ లో టాక్ చక్కర్లు కొడుతుంది, అది ఎంతవరకు నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉండగా…
సంపూ సేఫ్ మార్కెట్ రేంజ్ కి మించి ఇది డబుల్ రిస్క్ అనే చెప్పాలి. కానీ ప్రజెంట్ పరిస్థితులు అన్నీ కూడా సెటైరికల్ గా సినిమాలో చూపెడతారని… ఆడియన్స్ కి కనెక్ట్ అయితే కచ్చితంగా సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని అంటున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ గురించిన ఎలాంటి ఇన్ఫో లేకున్నా సినిమా వచ్చే ఏడాది మొదట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వార్తలు ఉన్నాయి.