లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మూవీ యుఫోరియా వలన అనుకున్న రేంజ్ లో జోరు చూపించ లేక పోయిన కార్తీ, అరవింద్ స్వామిల కాంబోలో రూపొందిన సత్యం సుందరం(Sathyam Sundaram Movie)…తెలుగులో యావరేజ్ రేంజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా తమిళ్ అండ్ వరల్డ్ వైడ్ గా మాత్రం ఉన్నంతలో…
వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి డీసెంట్ హిట్ గా నిలిచింది….సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 24.6 కోట్ల షేర్ తో 3.2 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది…బాక్స్ ఆఫీస్ రన్ తర్వాత సినిమా…
డిజిటల్ రిలీజ్ తర్వాత మంచి రీచ్ ను సొంతం చేసుకుని రచ్చ చేయగా….రీసెంట్ గా సినిమా తెలుగు వర్షన్ ను స్టార్ మా ఛానెల్ లో డీసెంట్ ప్రమోషన్స్ ని చేసి టెలికాస్ట్ చేయగా సినిమాకి మంచి రేటింగ్ సొంతం అయ్యింది అని చెప్పాలి.
రీసెంట్ టైంలో టాప్ స్టార్ మూవీస్, క్రేజీ సినిమాలకు కూడా డీసెంట్ రేటింగ్స్ రావడం లేదు. అలాంటిది ఈ సినిమా కి మాత్రం ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు స్టార్ మా లో 4.78 రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని మంచి జోరు చూపించింది…
మొత్తం మీద ఈ సినిమా జానర్ దృశ్యా చూసుకుంటే ఈ రేటింగ్ మంచి రేటింగ్ అని చెప్పాలి. ఓవరాల్ గా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర తర్వాత డిజిటల్ లో ఇప్పుడు టెలివిజన్ లో కూడా మంచి జోరుని సినిమా చూపించింది అని చెప్పాలి…ఇక టెలివిజన్ లో లాంగ్ రన్ లో మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.