Home న్యూస్ 40 నుండి 70….అందరూ చూసిన సినిమానే…అయినా 4 రోజుల్లో మంచి కలెక్షన్స్!!

40 నుండి 70….అందరూ చూసిన సినిమానే…అయినా 4 రోజుల్లో మంచి కలెక్షన్స్!!

0

సమ్మర్ కానుకగా తెలుగు లో థియేటర్స్ లో రిలీజ్ కి ఆల్ మోస్ట్ సిద్ధం అయిన టైం లో అనుకోకుండా కరోనా వలన థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న తమిళ్ హీరో శివకార్తికేయన్ నటించిన శక్తి సినిమా తెలుగు డబ్ వర్షన్ డిజిటల్ లో మంచి విజయాన్నే నమోదు చేయగా తర్వాత టెలివిజన్ లో కూడా బెటర్ రేటింగ్ లను సొంతం చేసుకుని మంచి ఆదరణ ని సొంతం చేసుకుంది ఇక్కడ.

ఇప్పుడు థియేటర్స్ 8 నెలల తర్వాత రీ ఓపెన్ అయిన సందర్భంగా ఈ సినిమాను కేవలం 40 స్క్రీన్స్ లో చాలా లిమిటెడ్ గా రిలీజ్ చేయగా మొదటి రోజు కేవలం 30 వేల రేంజ్ లోనే సినిమా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. కానీ మరో కొత్త సినిమా కరోనా వైరస్ కన్నా…

బెటర్ టాక్ ఈ సినిమాకి ఉండటం తో ఆ సినిమా కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ అవుతూ రెండో రోజు నుండి గ్రోత్ ని చూపెట్టిన ఈ సినిమా మొత్తం మీద 40 స్క్రీన్స్ నుండి ఇప్పుడు 70 స్క్రీన్స్ వరకు గ్రోత్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక కలెక్షన్స్ ఒకప్పటి స్టాండర్డ్ లో లేక పోయినా కానీ..

మొత్తం మీద 4 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. అంటే మొదటి రోజు 30 వేల నుండి 4 రోజులకు వచ్చే సరికి 2 లక్షల షేర్ దాకా మంచి గ్రోత్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా సింగిల్ స్క్రీన్స్ లో పర్వాలేదు అనిపించే విధంగా పెర్ఫార్మ్ చేస్తుంది.

కరోనా వైరస్ సినిమాతో పోల్చితే రెండో రోజు నుండి మంచి గ్రోత్ ని సాధించిన ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, ఆల్ రెడీ చాలా మంది చూసేసినా కానీ సినిమా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తూ మెప్పిస్తుండటం విశేషం అనే చెప్పాలి. ఇక ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here