Home Uncategorized సరిలేరు నీకెవ్వరు డే(5), అల వైకుంఠ పురంలో డే(4), ఎంతమంచి వాడవురా డే(1) కలెక్షన్స్!!

సరిలేరు నీకెవ్వరు డే(5), అల వైకుంఠ పురంలో డే(4), ఎంతమంచి వాడవురా డే(1) కలెక్షన్స్!!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ కి పీక్స్ వెళ్ళే టైం వచ్చేసింది, సంక్రాంతి కి రిలీజ్ అయిన తెలుగు సినిమాలు ఈ రోజు బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతున్నాయి. ముందుగా డబ్ మూవీ దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అవ్వగా ఈ రోజు 40 లక్షల నుండి 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.

ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే మహేష్ సరిలేరు నీకెవ్వరు మాస్ క్లాస్ అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో కుమ్ముతుంది, కానీ థియేటర్స్ కొన్ని కొత్త సినిమా కి వెళ్ళాయి, అయినా కానీ ఉన్న థియేటర్స్ లో సినిమా సాలిడ్ గా హోల్డ్ చేయగా…

ఈ రోజు సినిమా అవలీలగా 9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే లెక్క 9.5 కోట్లని టచ్ చేయోచ్చు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు సాలిడ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది.

సినిమా ఈ రోజు అవలీలగా మరోసారి 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, ఇక పూర్తీ లెక్కలు బాగుంటే లెక్క 10.5 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం మించే అవకాశం కూడా ఉంది. ఇక కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా… హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దుమ్ము లేపుతుంది.

సినిమా కి 300 వరకు థియేటర్స్ దక్కగా ఆ థియేటర్స్ లో సినిమా ఫస్ట్ డే ఇప్పుడు 2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఫైనల్ లెక్కలు కొంచం అటూ ఇటూ గా ఉండే అవకాశం ఉంది, మొత్తం మీద అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపాయి. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here