Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు డే(6), అల వైకుంఠ పురంలో డే(5), ఎంత మంచి వాడవురా డే(2) కలెక్షన్స్!!

సరిలేరు నీకెవ్వరు డే(6), అల వైకుంఠ పురంలో డే(5), ఎంత మంచి వాడవురా డే(2) కలెక్షన్స్!!

0

 సంక్రాంతి అన్ని సినిమాలు పండగ రోజుల్లో మంచి ఆక్యుపెన్సీ తో దూసుకు పోతున్నాయి, సంక్రాంతి సెలవు రోజున అన్ని సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 24 కోట్లకి పైగా షేర్ ని సాధించాయి, ఇక ఇప్పుడు కనుమ హాలిడే రోజున ఈ సినిమాల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా సంక్రాంతి ఫస్ట్ రిలీజ్ దర్బార్ ఈ రోజు మరో 40 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఇక సంక్రాంతి బిగ్గీస్ సరిలేరు నీకెవ్వరు ఈ రోజు కూడా అదిరి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకుపోతుంది, సినిమా హోల్డ్ చేసిన తీరు చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు సినిమా మరో సారి దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించవచ్చు.

Sarileru Neekevvaru 6th Day Collections!!

తక్కువలో తక్కువ 8.5 కోట్ల రేంజ్ లో సినిమా షేర్ ని అందుకోవచ్చు. ఇక అన్ని లెక్కలు పెర్ఫెక్ట్ గా ఉంటె 9 కోట్ల మార్క్ ని కూడా అందుకునే అవకాశం ఉంది. ఇక మరో బిగ్గీ అల వైకుంఠ పురం లో క్లాస్ మూవీ నే అయినా ఊచకోత కోసే కలెక్షన్స్ ని సాధిస్తుంది.

Ala Vaikunthapurramuloo 5th Day Collections!!

సినిమా 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమమ్ 9 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 9.5 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అది 10 కోట్లు మించినా ఆశ్యర్య పోనవసరం లేదు. ఇక కళ్యాణ్ రామ్ ఎంతమంచి వాడవురా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

Entha Manchi Vaadavuraa First Day Total Collections

పర్వాలేదు అనిపించే విధంగా హోల్డ్ చేయగా రెండో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 1.2 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద అన్ని సినిమాలు తమ తమ రేంజ్ లో దుమ్ము లేపుతున్నాయి. ఇక అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here