కర్ణాటకలో ఇది వరకు డైరెక్ట్ గా ఇతర భాషల సినిమాలు అలాగే రిలీజ్ అవుతూ ఉండేవి, కానీ రీసెంట్ గా అక్కడ రూల్ మారగా కన్నడ లో డబ్ చేసుకుని రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పడం తో కొత్త సినిమాలు కొన్ని అక్కడ డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా ఇప్పుడు టెలివిజన్ లో సినిమాల కొరత వలన ఇతర భాషల సినిమాలను కన్నడ లో డబ్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తెలుగు సినిమాలు ప్రతీ వారం అక్కడ డబ్ అవుతూ టెలికాస్ట్ అవుతుండగా లాస్ట్ వీక్ కూడా 2 సినిమా లు అక్కడ డబ్ అయ్యి టెలికాస్ట్ అయ్యాయి, అవ్వడమే కాకుండా మంచి రేటింగ్స్ ని కూడా సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి.
అంతకుముందు వారం టెలికాస్ట్ అయిన నాని కొత్త సినిమా జెర్సీ కి 2.3 రేటింగ్ మాత్రమే దక్కగా లాస్ట్ వీక్ అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి మరియు నితిన్ అ ఆ సినిమాలు అక్కడ టెలికాస్ట్ అవ్వగా రెండింటి కి కూడా డీసెంట్ TRP రేటింగ్స్ రావడం ఇప్పుడు మరిన్ని సినిమాలను మంచి అవకాశాన్ని కల్పిస్తుంది అని చెప్పాలి.
ఇక అల్లు అర్జున్ 5 ఏళ్ల క్రితం నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకి 4.41 TRP రేటింగ్ ని సాధించి దుమ్ము లేపగా… నితిన్ 4 ఏళ్ల క్రితం నటించిన అ ఆ సినిమా 4.22 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, ఈ రెండు సినిమాలు కూడా కన్నడ లో డబ్ అయిన తెలుగు సినిమాల్ల….
టాప్ రేటింగ్స్ ని అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచాయి. ఒకసారి ఆ లిస్టును గమనిస్తే
👉#SarileruNeekevvaru: 6.5 TRP
👉#Syeraa : 6.3
👉#Sarrainodu: 6.3
👉#Rangsthalam: 6
👉#GeethaGovindam: 5.6
👉#AAa: 4.41
👉#SonOfSathyamurthi: 4.22
👉#Taxiwala: 4.14 TRP
ఇక లాస్ట్ వీకెండ్ లో ఎన్టీఆర్ అరవింద సమేత టెలికాస్ట్ అవ్వగా ఆ సినిమా రేటింగ్ వచ్చే వారం రిలీజ్ కానుంది. ఫ్యూచర్ లో కూడా మరిన్ని తెలుగు సినిమాలు కన్నడ లో డబ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.