బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన నిఖిల్(Nikhil Siddhartha) నటించిన స్పై(SPY Movie) మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను మించి పోయి వసూళ్ళని సొంతం చేసుకున్నా కానీ తర్వాత పూర్తిగా స్లో డౌన్ అయిపొయింది.
సినిమా రిలీజ్ విషయంలో చాలా తక్కువ టైం ప్రమోషన్స్ కి ఉండటంతో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేద్దామని హీరో నిర్మాతతో చెప్పినా కూడా నిర్మాత అప్పటికే OTT వాళ్ళతో డీల్ మాట్లాడటంతో ఇక చేసేదేమీ లేక జూన్ 29న రిలీజ్ చేశారు… కానీ టైం తక్కువ ఉండటంతో…
హీరో నిఖిల్ కార్తికేయ2(Karthikeya2) మాదిరిగా భారీ రిలీజ్ నే అనుకున్నా కానీ ప్రింట్స్ అనుకున్న విధంగా అన్ని చోట్లలకు వెళ్ళాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మినహా మిగిలిన చోట్ల కేవలం 10% వరకు మాత్రమే ప్రింట్స్ వెళ్ళాయి. ఆ ఇంపాక్ట్ కూడా ఓపెనింగ్స్ పై పడింది.
ఇక ఓవర్సీస్ లో 450 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ ను ప్లాన్ చేస్తే 300 వరకు లోకేషన్స్ లో రిలీజ్ నే నోచుకోలేదు ఈ సినిమా…. దాంతో ఓపెనింగ్స్ పై ఈ ఇంపాక్ట్ పడింది… టాక్ కొంచం మిక్సుడ్ గా ఉండటం పక్కకు పెడితే నిఖిల్ ముందు నుండి సినిమా సజావుగా రిలీజ్ అవ్వడం…
ప్రమోషన్స్ కూడా తక్కువ టైంలో చేయడం కష్టమనే పోస్ట్ పోన్ చేయాలనీ అనుకున్నా నిర్మాత నిర్ణయం వలన సినిమా అదే డేట్ కి రిలీజ్ అయినా నిఖిల్ ముందు నుండే అనుకున్నట్లే అనుకున్న రేంజ్ లో రిలీజ్ కాలేక పోయింది. ఒకవేళ అనుకున్న రేంజ్ లో రిలీజ్ అయ్యి ప్రమోషన్స్ కూడా బాగా జరిగి ఉంటే… వీకెండ్ కే సినిమా సేఫ్ అయ్యేదేమో ఈ టాక్ తో కూడా… కానీ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాల్సిన అవసరం నెలకొంది.