యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ అలాగే హోల్డ్ చేస్తున్న విధానం అమోఘం అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో అద్బుతమైన కలెక్షన్స్ ని అన్ని సెంటర్స్ లో సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న లవ్ స్టొరీ సినిమా ఇప్పుడు…
టాలీవుడ్ తరుపున మరో హిట్ మూవీ గా నిలవడానికి దూసుకు పోతుంది. ఇదే టైం లో సినిమా సక్సెస్ ను చూసి ఇటు బాలీవుడ్ కానీ ఇటు కోలివుడ్ కానీ మైండ్ బ్లాంక్ అయ్యింది అనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ లో లో టికెట్ రేట్లు అండ్ 50% ఆక్యుపెన్సీ ఉన్నాయని అందరికీ తెలుసు…
ఇలాంటి అవరోధాలు ఉన్నప్పటికీ కూడా సినిమా ఈ రేంజ్ లో హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం చూసి తమ ఇండస్ట్రీ ల నుండి ఎప్పుడు ఇలాంటి రిజల్ట్ లు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. మహారాష్ట్రలో త్వరలోనే 100% ఆక్యుపెన్సీ తో థియేటర్స్ ఓపెన్ కానున్నాయి…
ఇటు తమిళనాడులో ఆల్ రెడీ థియేటర్స్ ఓపెన్ అవ్వగా రీసెంట్ గా ఒక సక్సెస్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలే కాదు ఇండియా లో ఉన్న ఇతర ఇండస్ట్రీలు అన్నీ కూడా లవ్ స్టొరీ లాంటి ఒక్క సక్సెస్ దక్కితే తిరిగి ట్రాక్ ఎక్కొచ్చు అన్న నమ్మకంతో ఉండగా అదే టైం లో ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర…
సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న లవ్ స్టొరీ సక్సెస్ చూసి మైండ్ బ్లాంక్ అయ్యిందనే చెప్పాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సినిమా టాక్ బాగుంటే థియేటర్స్ కి ఎగబడి వెళ్లి చూసి ఆ సినిమాను సక్సెస్ చేయడం ఒక్క టాలీవుడ్ కే చెల్లింది అని ఫస్ట్ వేవ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకెండ్ వేవ్ తర్వాత అందరికీ క్లియర్ గా అర్ధం అయ్యింది అని చెప్పాలి.