ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాలు చాలా తక్కువ, కరోనా ఎఫెక్ట్ తో చాలా సినిమాలు రిలీజ్ ఆగిపోగా… మిగిలిన సమయంలో సంక్రాంతి మూవీస్ రిజల్ట్ వలన చాలా సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపకుండానే పరుగును ముగించాయి. లాస్ట్ ఇయర్ ఎండ్ లో జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా రిలీజ్ అవ్వగా పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినప్పటికీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ని అందుకోలేక ఫ్లాఫ్ గా మిగిలి పోయింది, ఇక ఆ సినిమా వచ్చిన రెండు నెలల టైం లోనే సుడిగాలి సుధీర్ టీం మొత్తం కలిసి 3 మంకీస్ అనే కామెడీ మూవీ చేశారు. ఆ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చినా…”సాఫ్ట్ వేర్ సుధీర్ కలెక్షన్స్: అమ్మింది 1.80 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!”
సాఫ్ట్ వేర్ సుధీర్ లా పబ్లిసిటీ ని పెద్దగా దక్కించుకోలేదు, చాలా లిమిటెడ్ గా రిలీజ్ అయిన 3 మంకీస్….సాఫ్ట్ వేర్ సుధీర్ సాధించిన కలెక్షన్స్ వలన పర్వాలేదు అనిపించే విధంగా 1 కోటి రేంజ్ లో బిజినెస్ ని టోటల్ గా సొంతం చేసుకోగా… సినిమా మొత్తం మీద రన్ పూర్తీ అయ్యే టైం కి….
నైజాం లో సినిమా 18 లక్షల షేర్ ని సీడెడ్ లో 4 లక్షల దాకా షేర్ ని ఆంధ్రా లో 13 లక్షల షేర్ ని మొత్తం మీద సొంతం చేసుకుందట. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద ఈ సినిమా 35 లక్షల దాకా షేర్ ని అందుకోగా మిగిలిన చోట్ల షేర్ 2 లక్షల లోపు ఉంటుందని అంచనా…
దాంతో టోటల్ గా సినిమా 37 లక్షల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని పరుగును ముగించింది. సినిమా బిజినెస్ 1 కోటి రేంజ్ లో ఉండగా కేవలం 40 లక్షల లోపు కలెక్షన్స్ మాత్రమె రికవరీ అయ్యి 60 లక్షలకు పైగా లాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొంచం బెటర్ ప్రొడక్షన్ టీం ని చూసుకుని సినిమా చేస్తే సుధీర్ కి మంచి రిజల్ట్ దక్కే అవకాశం ఉందని చెప్పొచ్చు…