Home TRP రేటింగ్ ఆకాశం నీ హద్దు రా TRP…మంచి సినిమా…ఇదేం షాకింగ్ TRP సామి!

ఆకాశం నీ హద్దు రా TRP…మంచి సినిమా…ఇదేం షాకింగ్ TRP సామి!

0

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగి ఉన్న హీరో సూర్య… ఇప్పుడంటే హిట్స్ లేక డౌన్ ఫాల్ లో ఉన్నాడు కానీ ఒకప్పుడు అద్బుతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఆకాశం నీ హద్దు రా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా నే అయినా కానీ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

కాగా సినిమా డిజిటల్ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకోగా మొదటి సారి టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది, అటు తమిళ్ లో ఇటు తెలుగు లో సినిమా సంక్రాంతి పండగ రోజున జెమినీ టీవీ లో టెలికాస్ట్ అవ్వగా సినిమా TRP రేటింగ్…

ఒకింత షాక్ కి గురి అయ్యేలా చేసింది అని చెప్పాలి. అటు తమిళ్ లో ఇటు తెలుగు లో సెన్సేషనల్ రేటింగ్ లను సినిమా సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ తమిళ్ లో 13.7 TRP రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు కి వచ్చే సరికి మొత్తం మీద…

6.83 రేటింగ్ తోనే సరిపెట్టుకుంది. అంత మంచి సినిమా, సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా ఇంకా ఎక్కువ రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది అని అంతా అనుకున్నారు, పండగ రోజు అవ్వడం తో జనాలు బయట ఎక్కువగా వెళ్ళడం, సినిమాల కోసం థియేటర్స్ వెళ్ళడం లాంటివి జరిగి ఉంటాయి కానీ ఈ సారి ఫ్యామిలీస్ మరీ ఎక్కువ సంఖ్యలో బయటికి రాలేదు.

దాంతో టెలివిజన్ షోలకు ప్రోగ్రామ్స్ కి మంచి రేటింగ్ లే దక్కాయి. కానీ ఈ సినిమా విషయానికి వచ్చే సరికి ఇటు తెలుగు లో అటు తమిళ్ లో కూడా లాస్ట్ వీక్ టాప్ రేటింగ్ ను సొంతం చేసుకోలేదు. మొత్తం మీద పర్వాలేదు అనిపించే రేటింగ్ తోనే సరిపెట్టుకుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here