జబర్దస్త్ తో పాపులర్ అయ్యి హీరోగా కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న వాళ్ళలో సుడిగాలి సుధీర్ ఒకరు, మిగిలిన వాళ్ళతో పోల్చితే హీరోగా కొంచం బెటర్ రిజల్ట్ ని సాధించినది కూడా సుధీర్ అనే చెప్పాలి. సినిమాల్లో కొన్ని సార్లు హీరోగా, కొన్ని సార్లూ సైడ్ రోల్స్ చేసినా పెర్ఫెక్ట్ గా హీరో లా లాంచ్ అయిన సినిమాలు రెండు మూడు ఉండగా వాటితో పర్వాలేదు అనిపించుకున్నాడు సుధీర్.
లాస్ట్ ఇయర్ ఎండ్ వచ్చిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించి తనకీ మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని నిరూపించింది, ఆ నమ్మకం తోనే ఇప్పుడు మూడు నాలుగు కొత్త సినిమాలను కమిట్ అయిన సుధీర్…
రీసెంట్ గా మరో కొత్త సినిమా ను కమిట్ అవ్వగా ఈ సారి స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నాడని సమాచారం. కాగా ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా అని అంటున్నారు. సాదారణంగా అప్ కమింగ్ లేదా కొత్త యాక్టర్స్ మూవీస్ విషయానికి వస్తే…
పెద్దగా బడ్జెట్ పెట్టారు… కోటి నుండి 2 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రిస్క్ చేస్తూ ఉంటారు, కానీ సుధీర్ సాఫ్ట్ వేర్ సుధీర్ పోటి లో కూడా 1.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవడం తో పాటు శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కూడా దక్కించుకోవడం తో ఇప్పుడు తనపై 4.5 కోట్ల పెట్టుబడితో సినిమా చేస్తున్నారట.
ప్రస్తుతం ఒక హర్రర్ మూవీ, ఒక లవ్ స్టొరీ చేస్తున్న సుధీర్ వాటితో పాటు ఈ సినిమా చేస్తున్నాడట. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ కి కొత్త హీరోగా ఈ రేంజ్ బడ్జెట్ అంటే రిస్క్ అనే చెప్పాలి. బహుశా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ తో బడ్జెట్ కవర్ అవుతుంది అన్న నమ్మకం అయి ఉండొచ్చు అని టాక్ ఉంది, ఈ సినిమా త్వరలోనే మొదలు అవుతుందని సమాచారం. తన అప్ కమింగ్ మూవీస్ లో రెండు మూడు హిట్స్ కొట్టినా సుధీర్ కి మంచి బ్రేక్ లభించినట్లే అని చెప్పాలి.